The Goat Life: ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాలు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సంచలనం రేపాయి. ఈ లిస్ట్ లో ది గోట్ లైఫ్ కూడా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ది గోట్ లైఫ్: ఆడు జీవితం తెరకెక్కింది. సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర చేశాడు. ది గోట్ లైఫ్ చిత్రానికి బ్లెస్సీ దర్శకుడు. రచయిత బెన్యమిన్ రాసిన ఆడు జీవితం నవల ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బ్లెస్సీ ఆలోచన సినిమా రూపం దాల్చడానికి 16 ఏళ్ల సమయం పట్టింది. 2008లోనే ది గోట్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించాలని బ్లెస్సీ అనుకున్నాడు.
మొదట ఈ కథను ఆయన హీరో సూర్యకు చెప్పాడు. అప్పట్లో సూర్యకు ఉన్న కమిట్మెంట్స్ రీత్యా ఆయన తిరస్కరించాడు. దర్శకుడు బ్లెస్సీ కోరిన బడ్జెట్ సమకూర్చేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ది గోట్ లైఫ్ మూవీ తెరపైకి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పట్టింది. ఈ చిత్రం కోసం హీరో పృథ్విరాజ్ సుకుమారన్ చాలా కష్టపడ్డారు. ఆయన 30 కేజీలకు పైగా బరువు తగ్గినట్లు సమాచారం.
మార్చి 28న ది గోట్ లైఫ్ థియేటర్స్ లోకి వచ్చింది. మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల చేశారు. వరల్డ్ వైడ్ ది గోట్ లైఫ్ రూ. 150 కోట్ల వసూళ్ళు రాబట్టింది. ఈ సెన్సేషనల్ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ది గోట్ లైఫ్ మూవీ డిజిట్ల రైట్స్ ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. హాట్ స్టార్ ప్రతినిధులు మే 26 నుండి స్ట్రీమ్ కానుందట. దీంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆడు జీవితం కథ విషయానికి వస్తే… కేరళలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్న నజీబ్ మహ్మద్(పృథ్విరాజ్ సుకుమారన్) సౌదీ అరేబియా వెళ్లాలి అనుకుంటాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి డబ్బులు సంపాదించుకుని తిరిగి స్వదేశం రావాలనేది నజీబ్ కోరిక. కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశతో ఓ ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియా వెళతాడు. కానీ ఆ ఏజెంట్ మోసం చేస్తాడు. అనుకోకుండా నజీబ్ ఓ అరబ్ షేక్ వద్ద బానిసగా బ్రతకాల్సి వస్తుంది. ఎడారిలో గొర్రెలు కాస్తూ దుర్భరమైన ఒంటరి జీవితం అనుభవిస్తాడు. మరి నజీబ్ ఇండియాకు వచ్చాడా? లేదా? అతని జీవితం ఎలా ముగిసింది అనేది కథ…