కీరదోస దాదాపు అందరికీ ఇష్టమే. ఇది ఆరోగ్యకరమైన కూరగాయ మాత్రమకాదు శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది. కానీ అమెరికాలో ఇప్పుడు కీరదోస పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతున్నారు.
అక్కడ ఇటీవల కాలంలో అధిక మంది కీర దోస తిన్న తర్వాత ఉన్నట్లుండి అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకు కారణం సాల్మొనెల్లా అనే క్రీమి అని తేలిసంది. దీంతో అమెరికాలో కీర తిన్న వారందరికీ సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఇది కీర ద్వారా వ్యాపిస్తుందని అక్కడి మీడియా కోడై కూస్తుంది. అందుకే అమెరికా కీర దోస అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. కలుషితమైన ఆహారం తిన్న 12 నుంచి 72 గంటల్లోపు సాల్మొనెల్లా బ్యాక్టీరియా అనారోగ్యానికి కారణమవుతుందని అమెరికా ఆహార, ఔషధ నిర్వహణ (FDA) తెలిపింది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 29, మే 19 మధ్యకాలంలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన కీరదోస అధికంగా అమ్ముడయ్యాయి. దీంతో ఈ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించింది.
ఇప్పటివరకు అమెరికాలోని 15 రాష్ట్రాల్లో 26 మంది ఈ వ్యాప్తి కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. తొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్చారు. కీర తిన్న 13 మందిలో 11 మంది తిన్నవి ఫ్లోరిడాలోని బెడ్నార్ గ్రోవర్స్‌లో పండించినవి. వీటిని ఫ్రెష్ స్టార్ట్ ప్రొడ్యూస్ సేల్స్, రిటైల్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఇతర అవుట్‌లెట్‌లకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా మంది వీటిని తిన్నారని CDC తెలిపింది. అలబామా, ఒహియో, పెన్సిల్వేనియా వంటి ఇతర రాష్ట్రాలు దీనికి ప్రభావితమయ్యాయి. గత నెలలో పొలాల్లో సోదాలు చేయగా.. ఈ సమయంలో సాల్మొనెల్లా కనుగొనబడిందని FDA తెలిపింది. పరిశోధకులు బెడ్నార్ గ్రోవర్స్ పంట పొలాల నుంచి నమూనాలను సేకరించారు. అలాగే సాల్మొనెల్లా సోకిన వ్యక్తుల నుంచి కూడా నమూనాలను సేకరించారు. ఈ ఇన్ఫెక్షన్లు కలుషితమైన ఆహారం, నీటి ద్వారా, జంతువులతో, వాటి మలం, వాటి ఆవాసాల ద్వారా సాల్మొనెల్లా బారిన పడే అవకాశం ఎక్కువ. మనదేశంలో ఈ ఇన్ఫెక్షన్ గురించి ఎటువంటి కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదు.
కీర కొనేటప్పుడు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు..
కీరదోస తీసుకున్న తర్వాత, దానిని బాగా కడిగి తినాలి.
అది కొంచెం చెడిపోయినా తినక పోవడమే మంచిది.
కీరదోస వేడి నీటితో శుభ్రంగా కడిగితే ఇంకా మంచిది.
కీరదోసతో మీకు ఈ ఇన్ఫెక్షన్ సోకితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
































