పిల్లలు ఇక ఫోన్లు చూస్తే అడవులకే.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

డిజిటల్ యుగం వచ్చినప్పటి నుంచి చాలా మంది పిల్లలు ఫోన్లకే బానిసైపోతున్నారు. కాసేపు రీల్స్, కాసేపు గేమ్స్ అంటూ తమ బాల్యాన్ని ఫోన్లలో గడిపేస్తున్నారు.


దీని కారణంగా వారి శారీరక, మానసిక ఎదుగుదల నెమ్మదిస్తుంది. అలాగే వారిలో తెలివైతేటలు కూడా కరువైపోతున్నాయి. ఒకవేళ వారి నుంచి ఫోన్ లాక్కుంటే ఒక భూకంపమే. అందుకే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో మార్పు తెచ్చెదుకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రాజెక్టు ప్రారంభించింది. దానికి సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.

జంగిల్ లైబ్రరీ

పిల్లల్లో మార్పు కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టు జంగిల్ లైబ్రరీ. ‘జంగిల్ లైబ్రరీ’ అనే పేరు మాత్రం కొత్తగా అనిపిస్తుందా? ఈ ప్రాజెక్ట్ కూచ్ బిహార్ అడవుల్లో ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైబ్రరీలు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు మూడు రోజులపాటు ఈ అరణ్య ప్రాంతాల్లో పుస్తకాలతో సమయం గడిపిస్తారు. ప్రకృతి మధ్యలో, పక్షుల శబ్దాలు వింటూ, ఉష్ణమయంలో సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ, పుస్తకాలపై దృష్టి పెట్టడం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ లైబ్రరీలో పిల్లలకు ఆసక్తికరమైన పుస్తకాలు ఉంచారు. తద్వారా వారికి పుస్తక పఠనంలో ఆసక్తి పెరుగుతుంది. ఈ ప్రయత్నం పిల్లల ఫోన్ అడిక్షన్ తగ్గించి, ఇతర అంశాలపై వారి ఆసక్తిని మళ్లించే అవకాశం ఉంది. ఈ ఆలోచన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

బుద్ధి, ఆలోచనలపై ప్రభావం

ఈ రోజుల్లో ఫోన్లు, సోషల్ మీడియా వల్ల చిన్నారుల సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటున్నాయి. ఫోన్ లాంటి డివైసుల వాడకం వల్ల పిల్లలు ఏకాగ్రతలో, ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో ఈ అలవాట్లు వారి మేధా సామర్థ్యంపై, జ్ఞానాన్ని పెంచుకోవడంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, ఈ తరహా అలవాట్ల వల్ల పిల్లల్లో గందరగోళం, ఆలోచన శక్తి తగ్గిపోవడం, రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది. కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు గురవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితి దృష్ట్యా, పిల్లల ఫోన్ వాడకాన్ని తగ్గించే ఆవశ్యకత ఎంతైనా వుంది. వారు ఈ డివైసులకు బదులు ప్రకృతి, పుస్తకాలతో సంబంధం పెంచుకోవడం, జంగిల్ లైబ్రరీ వంటి ప్రాజెక్టుల ద్వారా తమ మేధా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచి మార్గం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.