ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పార్టీలూ, నేతలు భారీగా మనీ పంచడంతో.. మందు బాబులు.. ఆ మనీతో మద్యం కొనుక్కుంటున్నారు. ఇలా వారు ప్రశాంతంగా మద్యం తాగుతూ..
నిద్రలోకి జారుకుంటున్నారు. ఐతే.. వారికి షాక్ ఇచ్చే ఆదేశాలు ఏపీ పోలీస్ అధికారుల నుంచి వెళ్లాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్ గుప్తా తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
జూన్ 3, 4, 5 తేదీల్లో ఏపీలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరగకుండా.. అన్ని జిల్లాల్లో నిషేధించాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. అంతేకాదు.. తనిఖీలు బాగా చెయ్యాలని కోరారు. హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి, అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని అదుపులోకి తీసుకోవాలనీ, అలాగే.. అక్రమ మద్యం నిల్వలు ఉంటే, సీజ్ చెయ్యాలని ఆదేశించారు.
ఇక సోషల్ మీడియాపైనా ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఎవరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారో గమనిస్తున్నారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారి ఐపీ అడ్రెస్‌లు తెలుసుకొని, వారికి కాల్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు. మళ్లీ మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా పోలీసులు అన్ని రకాలుగా ఎన్నికలకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏపీలో జూన్ నెల 4న అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఇందుకు గంట టైమ్ పడుతుంది. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తారు. మధ్యాహ్నం 1 గంట కల్లా.. కౌంటింగ్ పూర్తి చెయ్యాలనే ప్లాన్‌లో అధికారులు ఉన్నారు.