టాలీవుడ్ మన్మథుడు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నాగ్.. ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు తమిళం భాషలలో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన ఓ హీరోయిన్ నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదని మీకు తెలుసా.. ? ఇంతకీ ఆమె ఎవరంటే..
అక్కినేని నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో నాగార్జున. ఇక ఆయనతో సినిమా అంటే హీరోయిన్స్ సైతం ఆసక్తి చూపిస్తుంటారు. సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, మీనా, శ్రియా, ఆర్తి అగర్వాల్, అనుష్క, స్నేహ, నయనతార వంటి స్టార్స్ అందరూ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నవారే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సూపర్ హిట్స్ అందుకుని టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న స్టార్స్ అందరూ దాదాపు నాగార్జునతో నటించినవారే. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ మాత్రం నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయని టాప్ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పటి అందాల రాశి రంభ. 16 ఏళ్లకే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, జేడీ చక్రవర్తి వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. అంతేకాదు..అప్పట్లోనే గ్లామర్ రోల్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రంభ.. నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. అందుకు పెద్ద కారణమే ఉందట.
నాగార్జునతో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందని సమాచారం. ఎందుకంటే.. అప్పట్లో నాగ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హలో బ్రదర్ ఒకటి. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ డ్యూయర్ రోల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ కంటే ముందుగా రంభను ఎంపిక చేసుకున్నారట డైరెక్టర్. ఆమెను కన్ఫార్మ్ చేసి డైట్స్ కూడా బుక్ చేశారట. కానీ నాగార్జున రమ్యకృష్మ కావలాని పట్టుబట్టడంతో రంభను తొలగించి ఆమెను తీసుకున్నారట. దీంతో ఆ తర్వాత నాగ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందట. ఇప్పటివరకు నాగ్ జోడిగా రంభ ఒక్క సినిమా సైతం చేయలేదు. కానీ డైరెక్టర్ ఈవీవీ కోరిక మేరకు హలో బ్రదర్ సినిమాలో ఈ పాటలో మెరిసింది.






























