నేటి కాలంలో చదివిన చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆయా రంగాల్లో ఖాళీలు లేకపోవడం.. ఉన్నా వాటికి సరపడా నైపుణ్యాలు అభ్యర్థుల్లో లోపించడం వంటి కారణాల వల్ల సరైన జాబులు పొందలేకపోతున్నారు. ఇక కొందరు ఉద్యోగాల నిమిత్తం.. సొంత ఊరు, రాష్ట్రం విడిచి దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ మన సొంత ప్రాంతంలోనే.. మంచి జీతంతో ఉద్యోగం లభిస్తే ఎంత బాగుటుందో కదా. మీరు కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. నెలకు 1,40,000 రూపాయల జీతంతో హైదరాబాద్ లోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఆ వివరాలు..
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానిస్తుంది. ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మీరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని భావిస్తున్నారా.. అయితే ఆన్‌లైన్ విధానంలో మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 13 చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.ecil.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. అలాగే.. అప్లయ్ చేసుకోవడానికి లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్య సమాచారం..
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు: 30
విభాగాల వారీ ఖాళీలు: ఈసీఈ- 5, ఈఈఈ- 7, మెకానికల్- 13, సీఎస్‌ఈ- 5 ఖాళీలున్నాయి.
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఏజ్ లిమిట్: (13.04.2024 నాటికి): 27 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 – 1,40,000గా ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
అప్లికేషన్ ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
అప్లై విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
చివరి తేదీ: ఏప్రిల్ 13, 2024