గత కొన్ని రోజులుగా దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఎంజీ మోటార్స్ తెరపైకి వచ్చింది. ఈ కంపెనీకి చెందిన ఎంజీ కామెట్, ఎంజీ జెడ్‌ఎస్, ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాల్లో టాటా కార్లను అధిగమించాయి.
ప్రస్తుతం ప్రతీ నెలా మార్కెట్‌లో వీటి సేల్స్ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సీన్ మారిపోయింది. భారత్‌లో ఎంజీ మోటార్స్ నుంచి అడుగుపెట్టిన విండ్సర్ ఈవీ అమ్మకాల్లో దూసుకెళ్తుంది. ప్రస్తుతం విండ్సర్ ఈవీ టాప్‌లో కొనసాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇకపై ఈ కారుని కొనుగోలు చేసే వారికి షాక్ తగలనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఈ విండ్సర్ ఈవీ క్రాసోవర్ యుటిలిటీ వెహికల్ (CUV) ధరను రూ.50000 లకు పైగా పెంచారు. గత డిసెంబర్ నెలలోనే ఈ కారు దాదాపు 10,000 యూనిట్లకు పైగా అమ్మడైంది. దీంతో గత కొన్ని నెలలుగా ఈ విండ్సర్ ఈవీ బెస్ట్ సెల్లర్ ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. తాజాగా దీనికి వస్తున్న డిమాండ్‌తో ధరను పెంచింది. దీని ధరను పెంచనున్నట్లు గతంలోనే కంపెనీ పేర్కొంది.
ఈ కారుని బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద కొనుగోలు చేయవచ్చు. ఇలా అందుబాటులో ఉన్న మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. బ్యాటరీ రెంటల్ ప్రోగ్రామ్ కింద దీనిని కేవలం రూ. 9.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్)కి కొనుగోలు చేయవచ్చు. దీంతో బాస్ ప్రోగామ్ కింద ప్రతి కిలోమీటర్‌కి రూ.3.50 అద్దె చెల్లిస్తే సరిపోతుంది.
ఇక బ్యాటరీ అద్దె లేకుండా రూ.13.50 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ధర పెంపుతో ఇప్పుడు రూ. 14 లక్షలకు పెరిగింది. దీనిని ఎక్సైట్ (Excite), ఎక్స్‌క్లూజివ్ (Exclusive), ఎసెన్స్ (Essence) అనే మూడు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. అన్ని వేరియంట్ల ధరలు రూ. 50,000 పెంచారు. దీంతో పాటు ఇన్ని రోజులు ఉచితంగా ఛార్జింగ్ సౌకర్యం కల్పించేవారు. ఇకపై ఇది కూడా లేదు.
ఈ కారుని టర్కోయిస్ గ్రీన్, స్టార్‌బర్ట్స్ బ్లాక్, క్లే బీజ్, పర్ల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఫుల్ ప్యాక్డ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 15.6 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, కనెక్టివిటీ ఆప్షన్లు, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ మంచి ఇంటీరియర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్‌లో మీడియా కంట్రోల్స్ కలవు.
ఇక సేఫ్టీ పరంగా లెవల్-2 ఏడీఏఎస్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ వంటి ఫీచర్లు కలవు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్‌స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి మరింత సేఫ్టీని అందిస్తాయి. సీటింగ్‌లోనూ ఇందులో భారీ కంఫర్ట్ స్పేస్ లభిస్తుంది.
ఇవే కాక టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన 360 డిగ్రీల కెమెరాలు కలవు. ఇక ఇందులోని 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని ఫుల్ ఛార్జ్‌పై 330 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీనిని 3 కిలోవాట్ల ఛార్జర్ ఉపయోగించి కేవలం 15 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అలాగే 7.4 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో గంటలోనే 80 శాతం ఛార్జ్ చేయవచ్చు.