30 రోజులు స్మార్ట్‌ఫోన్ లేకుండా జీవించిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే?

ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్‌ ఫోన్‌ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఫోన్ లేకుండా మన ఒక్క క్షణం కూడా గడపలేము. ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ ఫోన్ల ప్రపంచంలోనే జీవిస్తాము.


ఇలానే చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలవుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తులు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలయ్యారని వారికే తెలియదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తాను స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యానని గ్రహించిన 30 రోజులు ఫోన్ లేకుండా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయోగంలో, అతను అనేక విషయాలను తెలుసుకున్నాడు. అనేక అనుభవాలను పొందాడు. ఆనందం మన స్మార్ట్‌ ఫోన్‌లో కాదు, మన చేతుల్లో ఉందని అతను తెలుసుకున్నాడు.

ఫోన్‌ లేకుండా అతను నెల రోజులు ఎలా ఉన్నాడు?

మొదటి వారం: తనతో ఫోన్‌ లేని తొలి వారం రోజులు అతనికి చాలా కష్టంగా గడిచాయి. అతనికి ఫోన్‌ లేని లోటు చాలా స్పష్టంగా తెలిసింది.పదే పదే స్మార్ట్‌ఫోన్ కోసం చేయి చాపడం, ఊహల్లో వైబ్రేషన్లు వినడం వంటి అనుభవాలు అతను పొందాడు. మొత్తానికి ఫోన్‌ లేకుండా ఒక వారం గడిపాడు.

రెండవ వారం: రెండవ వారంలో, అతను కొత్తగా ఏదో అర్థం చేసుకున్నాడు. ఫోన్‌ లేకపోవడం వల్ల బోర్‌ కోడుకుతున్న ఫీలిండ్‌ను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే అతను ప్రజలతో మాట్లా, ప్రకృతిలో గడపడం స్టార్ట్ చేశాడు. ఇలా చేయడం అతనికి కొత్త అనుభూతిని కలిగించింది. కొత్త బంధాలను ఏర్పరిచింది.

మూడవ వారం: మూడో వారంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా, అతని నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోగలిగాడు. రాత్రి పూట టీవీ, ఫోన్‌ చూసే సదుపాయం లేకపోవడంలో పుస్తకాలు చదివే అలవాటును పెంచుకున్నాడు. అంతేకాకుండా, అతను తను చేసే పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాడు. సోషల్ మీడియా ప్రభావం లేకుండా కూడా అతను ఆనందాన్ని పొందాడు.

నాల్గవ వారం: స్మార్ట్‌ఫోన్ లేకుండా, అతను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ ఫోన్‌ లేక పోవడం వల్ల తాను పొందిన స్వేచ్ఛ ముందు ఆ ఇబ్బందులు చాలా చిన్నవని అర్థం చేసుకున్నాడు. కొన్ని కొత్త ప్రయత్నాలు మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని అతను తెలుసుకున్నాడు. చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించడం అలవాటు చేసుకున్నాడు.

అయితే 30 రోజుల తర్వాత అతను మళ్లీ ఫోన్‌ వాడడం స్టార్ట్ చేశాడు. కానీ ఈ సారి కొన్ని కండీషన్స్‌ పెట్టుకున్నాడు. వాటిలో ముఖ్యంగా నిద్రలేవగానే మీ ఫోన్‌ను చూడకూడదనుకున్నాడు, బెడ్‌రూమ్‌లోకి ఫోన్‌ తీసుకెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. అలాగే వారినికి ఒక రోజుకు ఫోన్‌కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.