అబ్బుర పరుస్తున్న తెన్ కాశి.. ఓ వైపు జలపాతాలు.. మరోవైపు ఆలయాలు.. ఎలా వెళ్లాలి..?

మిళనాడులోని ప్రముఖ పర్యటక ప్రదేశాల్లో తెన్ కాశి ఒకటి. ఇక్కడి జలపాతాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ఎత్తైన కొండలు, అలాగే ఇక్కడి ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి.


దేశంలోనే ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశంగా ఇది ఉంది. తెన్ కాశిని సౌత్ కాశీ అని కూడా పిలుస్తారు. తెన్ కాశి ప్రాంతం తిరునల్వేలికి 56 కిలోమీటర్ల దూరంలో, కొల్లం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో త్రివేండ్రం నుంచి 109 కిలోమీటర్ల దూరంలో, కన్యాకుమారి నుంచి 132 కిలోమీటర్ల దూరంలో అలాగే మధురై నుంచి 160 కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి 625 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధురై- కొల్లం హైవే కు సమీపంలోనే తెన్ కాశి ప్రాంతం ఉంది.

తెన్ కాశి ప్రాంతానికి మూడు వైపులా పశ్చిమ కనుమలు నిండి ఉంటాయి. ఈ ప్రాంతంలోనే అనేక వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడే కాశీ విశ్వనాథ్ టెంపుల్, కులశేఖరనాథ్ టెంపుల్, కన్నై మారమ్మన్ టెంపుల్ అలాగే కోర్టల్లమ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడే ఫైవ్ ఫాల్స్, తిరుమలాయ్ కోవిల్, మనిముతార్ డ్యామ్, చితిరి సబాయ్ టెంపుల్, మనిముతుర్ ఫాల్స్, తెన్ కాశి ఫోర్ట్, అగస్తియార్ ఫాల్స్, గుండార్ డ్యామ్, కన్నుప్పులి మెట్టు ఫాల్స్, కరుప్పానది డ్యామ్, అడవినైనార్ డ్యామ్.. లాంటివి ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి తెన్ కాశి ఎలా చేరుకోవాలంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి బస్సులు చెన్నైలోని మాధవరం బస్ స్టాండ్ లో ఆగుతాయి. అలా బస్సులో తెన్ కాశి చేరుకోవచ్చు. ఇక తెన్ కాశీ చేరుకోవాలంటే ముందుగా మధురై లేదా చెన్నై చేరుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి తెన్ కాశి చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటాయి. చెన్నై నుంచి బస్సుల్లోనూ తెన్ కాశి చేరుకోవచ్చు. ఇక మధురై నుంచి కూడా తెన్ కాశీకి బస్సులు, ట్రైన్స్ ఉంటాయి. తెన్ కాశి కి దగ్గరగా మధురై ఎయిర్ పోర్ట్ ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.