అమ్మకానికి సిద్ధమైన భారత తొలి ప్రధాని నెహ్రూ అధికారిక నివాసం… ఎన్ని కోట్ల ధర పలుకుంతుందంటే…

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అధికారిక నివాసం అమ్మకానికి సిద్దమైంది. ఈ చారిత్రాత్మక భవనం ఢిల్లీలోని లుటియెన్స్ బంగ్లా జోన్ మధ్యలో ఉంది.


అయితే తాజాగా ఈ భవనం అమ్మకానికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఒకప్పుడు స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మొదటి అధికారిక నివాసంగా పనిచేసిన మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని విశాలమైన బంగ్లాను విక్రయించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బంగ్లా ప్రాంతం మొత్తం 3.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే ఈ ఆస్తి ప్రస్తుతం రాజస్థాన్‌కు చెందిన మాజీ రాజకుటుంబ సభ్యులు రాజ్ కుమారి కాకర్, బినా రాణి యాజమాన్యంలో ఉంది. వారు మొదట ఈ ఆస్తిని రూ. 1,400 కోట్లకు అమ్మకానికి పెట్టారు.

అయితే ఈ ఆస్తిని భారతదేశ పానీయాల పరిశ్రమలో పెద్ద వ్యాపారవేత్త కొనుగోలు చేస్తున్నారు. దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ లావాదేవీల ప్రక్రియ జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వ్యాపారవేత్త… ఈ ఆస్తిని రూ.1,100 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యారు. ఏడాది పొడవునా జరిగిన సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఈ అమ్మకం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఒక ప్రముఖ న్యాయ సంస్థ ఈ భూమిపై వాదనలను ధ్రువీకరించడానికి పబ్లిక్ నోటీసు కూడా జారీ చేసింది.

బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ 20వ శతాబ్దం ప్రారంభంలో రూపొందించిన ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 28 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన రియల్ ఎస్టేట్ జోన్‌ ప్రాంతమే… లుటియెన్స్ బంగ్లా జోన్. ఇందులోని 17 మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ఈ బంగ్లా ఉంది. ఈ బంగ్లా భారతదేవం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్రారంభ సంవత్సరాల్లో తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు అధికారిక నివాసంగా ఉంది. ఇదిలాఉంటే, లుటియెన్స్ బంగ్లా జోన్‌లో దాదాపు 3,000 బంగ్లాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం కేంద్ర మంత్రులు, సీనియర్ న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉంటున్నారు. వీటిలో దాదాపు 600 బంగ్లాలు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. ఇవి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాస ఆస్తుల జాబితాలో నిలుస్తాయి.

రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం… ఈ బంగ్లా ఉన్న స్థలం, గుర్తింపు, చరిత్ర కారణంగా ఇది భారతదేశ చరిత్రలోనే అరుదైన ఒప్పందాలలో ఒకటిగా నిలుస్తుంది. ఆ బంగ్లా ఉన్న స్థానం, వీఐపీ హోదా, విశాలమైన స్థలం… తదితర ప్రత్యేకతల నేపథ్యంలో కొద్దిమంది బిలియనీర్లు మాత్రమే అటువంటి ఆస్తిని కొనుగోలు చేయగలరని ఈ విషయంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పారు.

ఈ బంగ్లా అమ్మకం రూ.1,100 కోట్ల అంచనా విలువతో పూర్తయితే… భారతదేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో ఇప్పటి వరకు నమోదైన రికార్డులన్నీ బద్దలవుతాయని భావిస్తున్నారు. ఇది దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు, వ్యాపారవేత్తలలో అల్ట్రా-ప్రైమ్ రియల్ ఎస్టేట్‌కు ఉన్న డిమాండ్‌ను సూచిస్తుంది. ఈ డీల్ లుటియెన్స్ బంగ్లా జోన్ శాశ్వత ప్రతిష్టను ప్రతిష్టను కూడా హైలైట్ చేస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.