వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ వస్తున్న మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja), రీసెంట్ గా ‘మాస్ జాతర'(Mass Jathara Movie) రూపం లో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
రవితేజ గత సినిమాతో పోలిస్తే బాగానే ఉన్నప్పటికీ, ఆడియన్స్ కి బాగా రొటీన్ అనిపించడం తో ఫ్లాప్ చేశారు. రవితేజ గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. కానీ ‘మాస్ జాతర’ కి కేవలం 20 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. ఇంత తక్కువ బిజినెస్ జరిగినప్పటికీ కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ డిజాస్టర్ అనేది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి క్లోజింగ్ లో కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ లో విడుదల చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో ఇంకా ముందే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో దర్శనం ఇవ్వనుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ నెల 20 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయిన ఈ చిత్రం, కనీసం ఓటీటీ ఆడియన్స్ ని అయినా అలరిస్తుందో లేదో చూడాలి. థియేటర్స్ లో ఈ చిత్రాన్ని ఎలాగో ఆడియన్స్ చూడలేదు కాబట్టి, ఓటీటీ లో బాగానే చూసే అవకాశాలు ఉన్నాయి.
































