ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. మరో నాలుగు రోజుల్లో ఆ పెన్షన్‌ స్కీమ్‌ నిబంధనల ప్రకటన

www.mannamweb.com


భారతదేశంలో జనాభాకు అనుగుణం వేతన జీవుల సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో కూడా ఉద్యోగుల సంఖ్య ఇతర దేశాలతో పోటీపడే విధంగా ఉంటుంది. అయితే రిటైరయ్యాక ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కేంద్రం గతంలో జాతీయ పెన్షన్‌ విధానం (జీపీఎస్‌)ను అమలు చేసేది.

అయితే అలా అమలు చేయడం వల్ల భవిష్యత్‌లో ఆర్థికంగా ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని జనవరి 1 2004 తర్వాత జాయిన్‌ అయిన ఉద్యోగులకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేస్తుంది. అయితే ఈ విధానంపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం ఉద్యోగుల కోసం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(యూపీఎస్‌)ను ప్రకటించింది. ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2025న ప్రణాళికాబద్ధంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. అయితే ఏకీకృత పెన్షన్ స్కీమ్(యూపీఎస్‌) రోల్ అవుట్ అక్టోబర్ 15 నాటికి అధికారిక నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రభుత్వ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అమలు యూపీఎస్‌ స్కీమ్‌ నిబంధనల గురించి వివరాలను తెలుసుకుందాం.

యూపీఎస్‌ స్కీమ్‌ అమలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కీలక మంత్రిత్వ శాఖలతో రెగ్యులర్ సంప్రదింపులు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ మునుపటి సమీక్షలో కూడా సోమనాథన్ కీలక పాత్ర పోషించారు. యూపీఎస్‌ డ్రాఫ్టింగ్, అభివృద్ధిలో వ్యయ విభాగం నాయకత్వం వహిస్తుంది. ఇతర విభాగాలు కీలకమైన సహాయక పాత్రలను పోషిస్తాయి. సిబ్బంది, శిక్షణ విభాగం ప్రస్తుత ఉద్యోగుల ప్రాధాన్యతలను అంచనా వేయడానికి బాధ్యత వహిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎన్‌పీఎస్‌, యూపీఎస్‌ ఈ రెండింటిలో ఏ పథకం కావాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయ ప్రక్రియ ఏప్రిల్ 2025 రోల్‌అవుట్‌లోపు పూర్తి కావాల్సి ఉంది.

పెన్షన్‌ శాఖ, పెన్షనర్ల సంక్షేమం వంటి కీలక శాఖలు యూపీఎస్‌ స్కీమ్‌ ప్రత్యేకతలను ఖరారు చేస్తున్నాయి. అలాగే సాధారణ పరిపాలనా సంస్కరణల విభాగం సేవా నిబంధనలను సవరించే పనిలో ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) పెన్షన్ నిధుల కోసం పెట్టుబడి ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ యూపీఎస్‌ అమలు కోసం సాంకేతిక అవసరాలను మూల్యాంకనం చేస్తోంది. యూపీఎస్‌ అధికారికంగా ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఎన్‌పీఎస్‌ కింద మార్చి 31, 2025 వరకు పదవీ విరమణ చేసే వారికి, పెన్షన్ ప్రయోజనాలు, బకాయిలు వర్తిస్తాయి. జనవరి 1, 2004 తర్వాత ఎన్‌పిఎస్ కింద చేరిన వారికి వారి చివరి జీతంలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్‌గా హామీ ఇస్తూ ఆగస్టు 24న కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం దాదాపు 23 లక్షల మంది పింఛన్‌పై కొత్త ఆశలు చిగురించేలా చేసింది.