ఒక దేశం అంటే ఎంత మంది ఉంటారు…? వంద కోట్ల నుంచి లక్షల వరకు జనాభా ఉంటారు. దేశాల గురించి ప్రస్తావన వస్తే కచ్చితంగా ముందు వినపడేది జనాభా యెంత అనే ప్రశ్న. చాలా దేశాలు జనాభాతోనే పాపులర్ అయ్యాయి. పెద్ద పెద్ద దేశాల్లో అయితే అక్కడ రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల్లో లక్షల నుంచి వేల వరకు జనాభా ఉంటారు. కాని ఒక దేశంలో కేవలం 23 మంది ఉంటారు. అవును మీరు చదివింది నిజం… ఒక పెద్ద కుటుంబం అంత మందే అక్కడ దేశం… ఇంతకి ఆ దేశం ఏంటి అంటారా…? ఆస్ట్రేలియా దేశంలో ఉండే హట్ రివర్ ప్రావిన్స్.
1970లో లియోనార్డ్ కాస్లీ తన వ్యవసాయ క్షేత్రాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి ఈ దేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది… ఒక ప్రత్యేక జెండా ఉంటుంది, ప్రత్యేక కరెన్సీ కూడా ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే… కచ్చితంగా వీసా కావాలి. అక్కడి నుంచి ఏ దేశం వెళ్ళాలి అన్నా సరే వీసా కావాల్సి ఉంటుంది. 23 మంది జనాభా మాత్రమె ఉండే ఆ దేశంలో కేవలం అయిదు ఇళ్ళు మాత్రమే ఉంటాయి. గోధుమ ఉత్పత్తి కోటాకు సంబంధించిన వివాదంపై అతను ఆస్ట్రేలియా నుండి విడిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఈ దేశం ఏర్పాటు జరిగింది.
ఇక తన కుటుంబానికి ఆయన బిరుదులు కూడా ఇచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా రాష్ట్రంలోని నార్తాంప్టన్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది 75 చదరపు కిలోమీటర్ల (29 చదరపు మైళ్ళు) వైశాల్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ దేశాన్ని ఆస్ట్రేలియా గాని ఇతర ఏ దేశాలు దేశంగా గుర్తించలేదు. ఆస్ట్రేలియా హైకోర్టు మరియు వెస్ట్రన్ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు ఇది ఆస్ట్రేలియా చట్టాలకు లోబడి ఉండదని చెప్పడం విశేషం. అయినా సరే అక్కడి ప్రజలు స్వతంత్రంగా బ్రతకడానికే ఎక్కువగా ఇష్టపడ్డారు. ఫిబ్రవరి 2017 లో, 91 సంవత్సరాల వయస్సులో మరియు 45 సంవత్సరాలు పాలించిన తరువాత, కాస్లీ తన చిన్న కుమారుడు, ప్రిన్స్ గ్రేమ్కు సింహాసనాన్ని అప్పగించాడు. కాస్లీ 13 ఫిబ్రవరి 2019 న మరణించారు.