ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర… నవంబర్ 15వ తేదీ శనివారం పసిడి ధరలు ఇవే… తులం బంగారం ధర ఎంత అంటే..?

నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు భారీగా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు నాలుగు వేల రూపాయల వరకు తగ్గినట్లు గమనించవచ్చు.


నవంబర్ 15వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,180 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,600 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,58,000 పలుకుతోంది. బంగారం ధరలు భారీగా పెరిగినట్లే పెరిగి ఒక్కరోజులోనే భారీగా తగ్గడం గమనించవచ్చు.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. నిజానికి బంగారం ధర పెరగడానికి ప్రధానంగా డాలర్ బలహీనత వల్లనే జరిగినట్లు చూడవచ్చు. కానీ అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు డిసెంబర్ నెలలో తగ్గిస్తారా లేదా అనే అంశం పైన ప్రాబబిలిటీ 49 శాతానికి పడిపోవడంతో వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదనే బలమైన వాదన ఇన్వెస్టర్లలోకి వెళ్లిపోయింది. ఫలితంగా పసిడి ధరలు భారీగా తగ్గాయి అని చెప్పవచ్చు. వడ్డీ రేట్లు తగ్గించకుండా స్థిరంగా ఉంచినట్లయితే అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. కచ్చితంగా బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా బంగారం ధరలు తగ్గడం చూడవచ్చు.

డాలర్ విలువ బలపడటం వల్ల కూడా ఈ పరిణామం చోటుచేసుకుందని చెప్పవచ్చు. మరోవైపు రెండు రోజుల క్రితం అమెరికాలో ఔన్స్ బంగారం ధర ఒక దశలో 4200 డాలర్లకు చేరుకుంది. కానీ అక్కడ నుంచి అమాంతం 150 డాలర్లు తగ్గి 4050 డాలర్లకు పడిపోయింది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ పరిణామం ఆనందకరం అని చెప్పవచ్చు.

బంగారం ధరలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గమనించినట్లయితే దాదాపు 50 శాతం పైనే పెరిగినట్లు చూడవచ్చు. అయితే బంగారం ధరలు ప్రస్తుతం మాత్రం తగ్గడం ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి కరెక్షన్ కేవలం స్వల్పకాలికమని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం తో పాటు వెండి ధర కూడా తగ్గడం గమనించవచ్చు. వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది అని చూడవచ్చు. వెండి ధర ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి భారీగా తగ్గినట్లు గమనించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.