ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.
వన్‌ప్లస్ ఓపెన్ ఎపెక్స్ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రేర్‌లో ఫినిష్ లెదర్ తో ఫ్రెష్ రెడ్ షేడ్ ఆప్షన్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.
ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,49,999గా నిర్ణయించారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్‌ను అందించారు.
ఇక ఈ ఫోన్‌లో 2268×2440 పిక్సెల్స్‌తో కూడిన 7.82 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. 2కే ఫ్లెక్సీ ఫ్యూయిడ్ ఎల్టీపీఓ 3.0 అమోలెడ్ ఇన్నర్ డిస్ ప్లే, 6.31 అంగుళాల (1,116×2484 పిక్సెల్స్) 2కే ఎల్టీపీఓ 3.0 సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ కవర్ స్క్రీన్‌ను అందించారు.
వన్‌ప్లస్ ఓపెన్ ఎపెక్స్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో హెస్సెల్ బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 48 ఎంపీ, 64 ఎంపీ, 48 ఎంపీతో కూడిన మూడు రెయిర్ కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 32 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాలను అందించారు.
కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదూ, ఏ-జీపీఎస్, క్యూజడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్‌ను ఇచ్చారు.