రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ నాలుగు స్టేషన్లకు శుభవార్త

ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి రైల్వే సామర్థ్యాన్ని మరింత పెంచాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా స్టేషన్లలో రైల్వే ప్రయాణికుల రద్దీని తగ్గించడం, ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడం కోసం రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించాలని భావించింది.


ఇందుకోసం దేశంలో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. 2030 నాటికి రైల్వే సామర్ధ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు రాబోయే ఐదు సంవత్సరాల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో సౌకర్యాలను పెంచనున్నట్లు స్పష్టం చేసింది. రైల్వే సదుపాయాలను గణనీయంగా పెంచడం, ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్లు సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.

48 సిటీలు ఎంపిక

రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా 48 ప్రధాన నగరాలను రైల్వేశాఖ ఎంపిక చేసింది. ఢిల్లీ, మంబై, కోల్‌కత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, లక్నో, పూణే, నాగ్‌పూర్, వారణాసి, కాన్పూర్, గోరఖ్‌పూర్, మధుర, అయోధ్య, ఆగ్రా, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, చండీగఢ్, లుధియానా, అమృత్‌సర్, ఇండోర్, భోపాల్, ఉజ్జయిని, జమ్మూ, జోధ్‌పూర్, జైపూర్, వడోదర, సూరత్, మడ్గావ్, కొచ్చి, పూరి, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హరిద్వార్, గౌహతి, భాగల్పూర్, ముజఫర్‌పూర్, దర్బంగా, గయ, మైసూర్, కోయంబత్తూర్, టాటానగర్, రాంచీ, రాయ్‌పూర్, బరేలీ స్టేషన్లను ఎంపిక చేశారు. రాబోయే 5 ఏళ్లల్లో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఈ నగరాల్లో రైల్వే కనెక్టివిటీని పెంచడం, రైల్వేల సామర్థ్యాన్ని పెంచడం లాంటి పనులు చేపట్టనున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు

తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ఈ నగరాల్లో రాబోయే రోజుల్లో రైల్వే వ్యవస్థ మరింతగా మెరుగపడనుంది. ఈ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చుట్టుపక్కల స్టేషన్లను కూడా ఆధునీకరించనున్నారు. మోగా కాంప్లెక్స్‌ల ఏర్పాటుతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నారు. అలాగే అన్నీ రైళ్లకు ట్రాక్ సామర్థ్యం పెంపు, సిగ్నల్స్, ట్రాఫిక్ సౌకర్యం పనులు, మల్టీట్రాకింగ్ ద్వారా సెక్షనల్ సామర్థ్యం పెంపు వర్క్స్ చేపట్టనున్నారు. దీని వల్ల ప్రయాణికులు మెరుగైన సేవలు పొంది త్వరగా ప్రయోజనం పొందగలుగుతారని రైల్వేశాఖ తెలిపింది. దీనిని బట్టి చూస్తే రానున్న 5 ఏళ్లల్లో భారత రైల్వేల స్వరూపం పూర్తిగా మారనుందని తెలుస్తోంది. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అలాగే రైల్వే స్టేషన్లు కొత్త రూపు తీర్చిదిద్దుకోనున్నాయి. ప్రాంతాలకు రైల్వే నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.