- రియల్‌మి 16 ప్రో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్, 12GB ర్యామ్ 256 GB స్టోరేజ్
- రియల్‌మి 16 ప్రో ప్లస్‌లో 6.8-అంగుళాల 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, 200MP ట్రిపుల్ కెమెరా సెటప్
- 80W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ 7,000mAh బ్యాటరీ ఆప్షన్లు
- జనవరి 9 నుంచి భారత మార్కెట్లో సేల్ ప్రారంభం
- కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మీరు రియల్‌మి ఫ్యాన్స్ అయితే మీకోసం అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. ఒకటి కాదు.. ఏకంగా రెండు ఫోన్లు వచ్చాయి. భారతీయ వినియోగదారుల కోసం రియల్‌మి కంపెనీ రియల్‌మి 16 ప్రో సిరీస్‌ను లాంచ్ చేసింది.
ఇప్పటివరకు ఈ రేంజ్‌లో రియల్‌మి 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో ప్లస్ ఉన్నాయి. ఈ ఫోన్లలో కంపెనీ గత మోడళ్లతో పోలిస్తే.. అద్భుతమైన కెమెరా, డిజైన్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌తో పాటు బడ్స్ ఎయిర్ 8, రియల్‌మి ప్యాడ్ 3 కూడా ప్రవేశపెట్టింది. ధర, స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రియల్‌మి 16 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 16 ప్రో ప్లస్ 6.8 అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో 144Hz రిఫ్రెష్ రేట్ 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్ నుంచి పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుంది.కెమెరా విషయానికొస్తే.. ఈ రియల్‌మి ఫోన్ మెయిన్ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా 8MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 50MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.
- రియల్‌మి 16 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 16 ప్రో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ చిప్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ నుంచి పవర్ పొందుతుంది. అదే 7,000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 200MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరాతో పాటు 50MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.
భారత్‌లో రియల్‌మి 16 ప్రో ప్లస్, 16 ప్రో ధర ఎంతంటే? :
రియల్‌మి 16 ప్రో ఫోన్ 8GB, 128GB వేరియంట్ ధర రూ.31,999కు లభించనుంది. 8GB ర్యామ్, 256GB వేరియంట్ ధర రూ.33,999కు లభించనుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ధర రూ.36,999కు లభించనుంది.రియల్‌మి 16 ప్రో ప్లస్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999 ఉంటుంది. 12GB, 256GB వేరియంట్ ధర రూ.44,999కు లభించనుంది. ఈ రెండు కొత్త రియల్‌మి ఫోన్లు జనవరి 9 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్లలో అమ్మకానికి వస్తాయి.


































