ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
న్యాయస్థానం ఆదేశాలతో ఉద్యోగుల వయోపరిపతి పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పదవీ విరమణ వయస్సు పెంపుపై ఏర్పాటుచేసిన ఉప సంఘం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం సమావేశమైంది. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఫైనాన్స్ శాఖమంత్రి పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు. అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా మంత్రి నారాయణ సమావేశంలో పాల్గొన్నారు.
కోర్టు ఆదేశాలతో 62 ఏళ్ల వయోపరిమితితో 2,831 మంది ఉద్యోగులు ఇప్పటికే కొనసాగుతున్నారని మంత్రి నారాయణ వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లు, 9 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు పెంపుపై సమాలోచనలు చేసింది. ప్రభుత్వం పై పడే ఆర్థిక భారంపై అధికారులతో సబ్ కమిటీ సభ్యులు చర్చించారు. కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు, ఆర్థిక భారం వివరాలతో మరోసారి సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నిర్ణయించారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఎన్నో హామీలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఈ క్రమంలోనే పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకుంది. గత అక్టోబర్ సమయంలో దసరా పండుగకు కరువు భత్యం ప్రకటించిన విషయం తెలిసిందే. పదోన్నతులు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం తాజాగా రిటైర్మెంట్ ఏజ్ పెంచడం విస్మయానికి గురి చేసింది.



































