ఎన్టీఆర్ ఊచకోత.. దేవర సినిమా స్టోరీ లైన్ ఇదే అయితే ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ

www.mannamweb.com


జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని ఎదుచూస్తున్నారు అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబుల్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా తారక్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా జపాన్ లోనూ తారక్ కు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఇక దేవర విషయానికొస్తే.. ఈ సినిమాలో తారక్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవర చిత్రం విడుదలకు ముందే జనాల్లో హల్‌చల్ చేస్తోంది.. అయితే ఈ సినిమా కథపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఒక్కోసారి సినిమా రిలీజ్ డేట్ గురించి, ఒక్కోసారి ఎన్టీఆర్ లుక్, క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో చాలా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది,

దేవర 27 సెప్టెంబర్ 2024న విడుదల కానుంది, దాని కథలోని కొంత భాగం నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడిందని టాక్ వినిపిస్తుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. దేవర దర్శకుడు కొరటాల శివ ‘శ్రీమంతుడు’, ‘ఆచార్య’ వంటి చిత్రాల కథలలో కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందాడు. అలాగే దేవరలోనూ వాస్తవ సంఘటనల ఆధారంగా కథ ఉంటుందని అంటున్నారు. 1985లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ‘కారంచేడు ఘటన’ ఆధారంగా ‘దేవర’ తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తుంది. దళితుల పై జరిగిన హింస నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రెండు ముఖాలను చూపించారు. ఇద్దరి ఎక్స్‌ప్రెషన్స్ వేరు. కొత్త పోస్టర్‌కి ‘ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అని ట్యాగ్ ఇచ్చారు మేకర్స్. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. సినిమా విడుదల తేదీలో కూడా చాలా మార్పులు చేశారు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు, అయితే షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో, షూటింగ్ షెడ్యూల్ మారింది. దేవర అక్టోబర్ 10న దసరాకు విడుదలవుతుందని వార్తలు వచ్చాయి, కానీ ఆ తేదీని సెప్టెంబర్ 27కి మార్చారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.