ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సంచలన ఆదేశాలు జారీ

www.mannamweb.com


ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకాలు ఆపాలని గతంలోనే ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

రాష్ట్రంలో యదేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో నాగేందర్ కుమార్ అనే ప్రతివాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయికి పంపాలని సూచించింది. అటు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. క్షేత్ర స్థాయికి వెళ్లి ఇసుక తవ్వకాలు నిలిపివేశారా..? లేదా అనేది తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

గత ఆదేశాలపై తీసుకున్న చర్యలను ఈ నెల 16న అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.