ఇలా చేస్తే మీరు కట్టే ట్యాక్స్ అమాంతం తగ్గిపోతుంది.. ఒకసారి ట్రై చేసి చూడండి..

www.mannamweb.com


రిమితికి మించిన ఆదాయం కలిగిన వారందరూ ఆదాయం పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. ముందుగా ఆదాయపు పన్నుశాఖకు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలి. అనంతరం మీరు పన్ను కట్టాల్సిన ఆదాయంపై అవగాహన కలుగుతుంది.

అయితే ఆదాయపు పన్ను చెల్లింపుల ద్వారా కూడా రివార్డులు, క్యాష్ బ్యాక్ లు పొందే అవకాశం ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఆదాయపు పన్నును చెల్లించి వీటిని పొందవచ్చు. అలాగే ఆదాయపు పన్నుచట్టంలోని వివిధ సెక్షన్ల ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. వీటినన్నింటినీ అనుసరించడం ద్వారా ఆదాయపు పన్ను ను ఆదా చేసుకోవచ్చు.

16 శాతం వరకూ క్యాష్ బ్యాక్..

మన దేశంలో కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఆదాయపు పన్నుపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. హెచ్ డీఎఫ్ సీ బిజ్ బ్లాక్, హెచ్ డీఎఫ్ సీ బిజ్ పవర్ తదితర క్రెడిట్ కార్డుల నుంచి ఈ అవకాశం ఉంది. వీటి ద్వారా ఆదాయపు పన్ను, జీఎస్ టీలను చెల్లించి 16 శాతం నుంచి 8 శాతం వరకు రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి.

మరికొన్ని రివార్డులు..

ఎస్ బీఐ విస్తారా, ఐడీఎఫ్ సీ విస్తారా తదితర క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఇలాంటి రివార్డులు పొందే అవకాశం ఉంది. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుపై మైల్‌స్టోన్ రివార్డులు అందజేస్తాయి.

ఐటీఆర్ కు జూలై 31 వరకూ గడువు..

2023 – 24 (ఏవై 2024-25) ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి జూలై 31 వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఆ గడువు దాటితే జరిమానా విధిస్తారు. జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేేసే అవకాశం డిసెంబర్ 31 వరకూ ఉంటుంది.

పన్ను ఆదాకు మార్గాలివే..

ఆదాయపు పన్నును ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా మీరు కొంత పన్నుభారాన్ని తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ద్వారా ఇవి అమలవుతున్నాయి. పూర్తి చట్టబద్ధత కలిగినవి కూడా.

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) తదితర పన్ను పొదుపు మార్గాలలో పెట్టుబడి పెట్టండి. ఆ పెట్టుబడికి పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.
  • వైద్య, విద్య ఖర్చులకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. వాటిని క్లెయిమ్ చేసుకోవడం వల్ల పన్ను ఆదా అవుతుంది. ఆ ఖర్చులను సంబంధించిన బిల్లలు, రశీదులను భద్రపర్చుకోవాలి.
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం మినహాయింపులు లభిస్తాయి. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఈఎల్ఎస్ఎస్ తదితరవాటిలో పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది.
  • సెక్షన్ 80డీ కింద కూడా మినహాయింపులు అందజేస్తారు. మీకు, మీ జీవిత భాగస్వామి, మీపై ఆధారపడిన పిల్లలకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియాలను ఇందులో క్లెయిమ్ చేయవచ్చు.
  • సెక్షన్ 80 టీటీఏ కింద పొదుపు ఖాతాలపై గరిష్టంగా రూ. పదివేల వరకూ వడ్డీపై తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు.
  • మీ పెట్టుబడి మార్గాలను పరిశీలించండి. కొన్నింటికి చట్ట ప్రకారం మినహాయింపులు లభిస్తాయి. వాటికి అనుగుణంగా తగ్గింపులను క్లెయిమ్ చేసుకోండి.
  • ఐటీఆర్ ను సకాలంలో ఫైల్ చేయండి. అనంతరం దాన్ని ధ్రువీకరించుకోండి. తద్వారా జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మీకు రీఫండ్స్ కూడా త్వరతగతిన అందుతాయి.