రాజాసాబ్ టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 9న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండగా..
రేపు (జనవరి 8) ప్రీమియర్ షోలు పడనున్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపు స్పెషల్ షోలకు అనుమతినిస్తూ జీఓ జారీ చేసింది. జనవరి 9 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు చిత్రయూనిట్ కు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.
సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.200 వరకూ పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.350 – రూ.400, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.450 -550 వరకూ ఉండనున్నాయి. ఈ సంక్రాంతికి రాజాసాబ్ టీమ్ బిగ్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసింది.


































