వాతావరణం మారుతోంది! మీ పిల్లల్ని జలుబు, దగ్గు నుంచి రక్షించుకోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి

www.mannamweb.com


వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారు. అందువల్ల వారికి మెరుగైన సంరక్షణ అవసరం.

ఓ వైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళ తేలికపాటి చలి ప్రారంభమైంది. శీతాకాలం సీజన్ రాకముందే ఈ రకమైన గాలివాతావరణానికి దగ్గు , జలుబు బారిన పడతారు. మన శరీర ఉష్ణోగ్రత పర్యావరణం వల్ల ప్రభావితమైనప్పుడు వైరల్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లడం వల్ల వారు వ్యాధుల బారిన పడుతున్నారు. అయినప్పటికీ ఈ సీజన్ లో వచ్చే దగ్గు లేదా జలుబును నివారించడానికి ఇంట్లో అనేక చిట్కాలను ట్రై చేయవచ్చు.

చలికాలం రాకముందే మారుతున్న వాతావరణంలో పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కోవిడ్ తర్వాత చాలా మందికి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంది. దీంతో చాలా ఈజీగా వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఈ సీజన్‌లో వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగే కొన్ని పద్ధతుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఉప్పు కలిపిన నీరు పుక్కిలించడం

ఉప్పునీటిని పుక్కిలించే వారికి వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కనుక రోజూ ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని పుక్కిలించాలి. ఈ పద్ధతి మన నోరు, గొంతులో ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి పని చేస్తుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇలా చేయవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ సమయంలో గొంతు వాపు ఉంటుంది. ఈ ఉప్పు కలిపిన నీరు పుక్కిలించడం వలన వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

నడక వంటి వ్యాయామం

వారంలో కేవలం 45 నిమిషాల పాటు వ్యాయామం చేసినా చాలు మన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 7 రోజుల్లో 45 నిమిషాల పాటు నడిస్తే రోగనిరోధక శక్తికి కూడా మేలు చేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాయామం కూడా మనలో సానుకూలత, విశ్వాసాన్ని తెస్తుంది. అందువల్ల మీ పిల్లలు ప్రతిరోజూ ఏదో ఒక విధంగా శారీరకంగా చురుకుగా ఉండేలా చేయండి.

తగినంత నిద్ర

పిల్లలకు తక్కువ నిద్రపోయే అలవాటు ఉంటే.. వారి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నవారు జలుబు లేదా దగ్గు ఇన్ఫెక్షన్ బారిన చాలా సులభంగా పడతారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 8 నుంచి 9 గంటల పాటు పూర్తి నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. పగటి సమయంలో నిద్రపోవడం కంటే.. రాత్రి సమయంలో తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. ఈ పద్ధతి పిల్లల మానసిక ఆరోగ్యాన్ని అలాగే శారీరక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. పెద్దలతో పాటు ముఖ్యంగా పిల్లలు రోజులో తగిన సమయంలో నిద్రపోయే అలవాటును చేయాలి.

హైడ్రేటెడ్ గా ఉండండి

శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మొత్తం శరీరానికి ప్రయోజనం చేకూరుతుంది, ఇందులో శ్వాసకోశ వ్యవస్థ కూడా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజంతా కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. దీని వల్ల చర్మం కూడా ప్రయోజనం పొందుతుంది. అంతేకాదు మలబద్ధకం వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆవిరి పడుతుంది

కోవిడ్ సమయంలో పసుపు,యు ఇతర వస్తువులతో చేసిన పానేయాలను తాగడమే కాదు ఆవిరి కూడా పట్టారు. ఇలా ఆవిరి పట్టే ప్రక్రియ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తక్కువ వేడి నీటితో పిల్లలు ఆవిరి పట్టేలా చేయండి. ఎందుకంటే పిల్లల రోగనిరోధక శక్తి పెద్దల కంటే కొంచెం బలహీనంగా ఉంటుంది. అయితే పిల్లలు ఆవిరి పట్టే నీటిలో వేప లేదా తులసి ఆకులను కూడా వేయవచ్చని జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా తెలిపారు. ఎందుకంటే వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి ఆవిరి పట్టడం ఒక గొప్ప మార్గం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)