500 కిలోల పేపర్లతో మహేష్ ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్లు తగలబడాల్సిందే

ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు…


ఇప్పుడు ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. ఏమాత్రం మహేష్ బాబు తగ్గడం లేదు. దాదాపు 50 సంవత్సరాలకు వచ్చినప్పటికీ యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు.

అయితే ఇవాళ ఆయన పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడు మూవీ రీ రిలీజ్ కూడా అవుతోంది. అతడు సినిమా టీవీలో వస్తేనే చాలామంది.. చూసి ఎంజాయ్ చేస్తారు. అలాంటిది రీ రిలీజ్ అయితే థియేటర్లు బ్లాస్ట్ కావాల్సిందే. మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ. కాబట్టి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమాకు ఎక్కువ సంఖ్యలో జనాలు వెళ్లే ఛాన్స్ ఉంది.

అయితే మహేష్ బాబు అభిమానులైతే అర్ధరాత్రి నుంచి థియేటర్ లోనే ఉన్నారు. ఇక కొంతమంది అయితే 500 కిలోల పేపర్లను.. సినిమా ఆడేటప్పుడు విసిరేందుకు రెడీ చేసుకున్నారు. తిరుపతి పలని థియేటర్ లో సినిమా చూసేందుకు సిద్ధమైన మహేష్ బాబు అభిమానులు… మొత్తం 500 కిలోల న్యూస్ పేపర్లను కట్ చేసి.. రెడీ చేసుకున్నారు. వాటిని సినిమా ప్రదర్శించే సమయంలో విసిరేందుకు… ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.