డీఎస్సీ పోస్టులు మార్చుకునే అవకాశం లేదు

డీఎస్సీలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం ఇక లేనట్టే.


పోస్టుల ఆప్షన్స్‌ మార్చుకునే అవకాశం లేదని డీఎస్సీ కన్వినర్‌ ఎం.వి.కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని, ఇక వాటిని మార్చేది లేదని మరోసారి తెలిపారు. డీఎస్సీ పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యం తీసుకున్నామని, ఇప్పుడు అదే ‘ఫైనల్‌’ అని పేర్కొన్నారు.

తాజా డీఎస్సీలో ఒకటికంటే ఎక్కువ పోస్టులు సాధించి, మొదటి ఆప్షన్‌గా ఎస్జీటీని పెట్టినవారు రాష్ట్రంలో 10 వేలమందికి పైగా ఉన్నారు. ఇప్పుడు వారంతా తాము సాధించిన ఉన్నతమైన పోస్టును కోల్పోయినట్టే. రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రాధాన్యతాక్రమంలో మొదటి ఆప్షన్‌గా పెట్టిన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది.

మెరిట్‌ లిస్టు ప్రకటించే ముందు వరకు టెట్‌ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు నాలుగుసార్లు అవకాశం కల్పించారు. అంతకుముందు దరఖాస్తుల్లో అభ్యర్థులు చేసిన తప్పులను సైతం సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు. కానీ.. పోస్టుల ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని కన్వినర్‌ ‘సాక

28 నుంచి సరి్టఫికెట్ల పరిశీలన
డీఎస్సీ మెరిట్‌ లిస్టులో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం ప్రారంభమవుతుందని కన్వీనర్‌ కృష్ణారెడ్డి తెలిపారు. వాస్తవానికి సోమవారం ప్రారంభించాల్సిన ఈ ప్రక్రియ వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీంతో అభ్యర్థులకు కాల్‌లెటర్లు సైతం అందించలేదు. సోమవారం రాత్రి నుంచి కాల్‌లెటర్లు పంపించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి డీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి కాల్‌లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వినర్‌ తెలిపారు. జోన్‌ ఆఫ్‌ కన్సిడరేషన్‌లోకి వచి్చనవారికి వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన సంబంధిత జిల్లాల్లోనే ఈనెల 28న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌ ద్వారా డీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోని సూచనలను కచి్చతంగా పాటించాలని ఆయన సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.