మన దేశంలో సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది భావోద్వేగం, ఆరాధన, ఒక సంస్కృతి. తెరపై కనిపించే హీరోలను అభిమానులు దేవుళ్లలా కొలుస్తారు.
తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే చాలు.. థియేటర్లలో పండుగలు చేస్తారు. ఇక స్టార్ హీరో సినిమా విడుదల అయితే.. థియేటర్లలో జాతర చేస్తారు. పునకాలతో ఊగిపోతారు. అలాంటి స్టార్ డమ్‌ను కొలిచే అత్యంత విశ్వసనీయ సంస్థ ఓర్మాక్స్ మీడియా'(Ormax Media) తాజాగా నవంబర్ 2025 సర్వే రిపోర్టును విడుదల చేసింది.ఈ సంస్థ తన సర్వేలో ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్ టాప్ 10 లిస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఓర్మాక్స్ మీడియా'(Ormax Media)నవంబర్ 2025 సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఈ సంస్థ తన సర్వేలో ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్ టాప్ 10 లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఆరుగురు టాలీవుడ్ హీరో చోటు దక్కించుకోగా.. ఇద్దరూ బాలీవుడ్, మరో ఇద్దరు కోలీవుడ్ హీరోలు చోటు సంపాందించుకున్నారు. ఓర్మాక్స్ మీడియాలిస్ట్ ప్రకారం ఇండియా మోస్ట్ పాపులర్ స్టార్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)మొదటి స్థానంలో నిలిచారు.
మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించారు. ‘బాహుబలి’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ఆ తర్వాత ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉండటంతో రాబోయే రోజుల్లోనూ ప్రభాస్ డామినేషన్ కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి.
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Vijay) రెండో స్థానంలో నిలిచారు. తమిళనాడులో ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ మామూలు కాదు. నార్త్ ఇండియాలోనూ క్రమంగా తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలతో ఆయన పేరు తరచూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఈ ఏడాది తన చివరి సినిమాను పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించడం కూడా విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) మూడో స్థానంలో నిలిచారు. గత కొంతకాలంగా వరుస బ్లాక్‌బస్టర్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన షారుక్ ఖాన్, ఇప్పటికీ దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానుల హృదయాల్లో అగ్రస్థానంలో ఉన్నారని ఈ లిస్ట్ మరోసారి రుజువు చేసింది. వయస్సు పెరిగినా, క్రేజ్ మాత్రం తగ్గలేదని ఓర్మాక్స్ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.
నాలుగో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నిలిచారు. ‘పుష్ప’ సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ను ఈ ర్యాంకింగ్‌లో ద్వారా తెలుసుకోవచ్చు. ఐదో స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)నిలిచారు. గత ఆరు నెలలుగా మహేశ్ బాబు రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో మహేశ్ బాబు కథనాయకుడిగా నటిస్తున్నారు. దీంతో మహేశ్ బాబు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ పాన్ ఇండియా మూవీ విడుదల అయితే.. ప్రిన్స్ మహేశ్ రేంజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక ఆరవ స్థానంలో తమిళ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar)చోటు దక్కించుకున్నారు. ఏడవ స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)నిలిచారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్‌కు వచ్చిన గ్లోబల్ రికగ్నిషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎనిమిదో స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)నిలిచారు. తొమ్మిదో స్థానంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) చోటు దక్కించుకున్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా పదో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ ఓర్మాక్స్ మీడియా టాప్ 10 లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ఆరుగురు హీరోలు చోటు దక్కించుకోవడం విశేషం. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇలా అందరూ తెలుగు సినిమా మార్కెట్ దేశవ్యాప్తంగా చేస్తూ.. బాలీవుడ్ ను కూడా ఏలేస్తున్నారని చెప్పవచ్చు. అలాగే.. భారతీయ సినిమా భవిష్యత్తు మరింత పాన్ ఇండియా దిశగా సాగుతోందని చెప్పే సంకేతం. రాబోయే నెలల్లో ఈ జాబితాలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.


































