షుగర్ వచ్చే ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే.. లైట్ తీసుకుంటే ఇక అంతే

రచుగా దాహం – మూత్రవిసర్జన: రక్తంలో షుగర్ పెరిగితే, దాన్ని బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేస్తాయి. దీని వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది.


మూత్రం ద్వారా నీరు ఎక్కువ పోతుంది కాబట్టి మనకు మాటిమాటికీ దాహం వేస్తుంది. ఎక్కువ నీరు తాగడం, తరచుగా బాత్రూమ్‌కు వెళ్లడం ఒక అలవాటుగా మారుతుంది.

ఎప్పుడూ అలసటగా ఉండటం: మన శరీరంలోని కణాలు శక్తి కోసం చక్కెరను వాడుకుంటాయి. డయాబెటిస్‌లో ఇన్సులిన్ సరిగా పనిచేయదు. కాబట్టి కణాలకు శక్తి అందదు. దీనివల్ల ఎంత పడుకున్నా లేదా విశ్రాంతి తీసుకున్నా సరే, బలహీనంగా, నీరసంగా అనిపిస్తుంది.

కళ్లు మసకబారడం: రక్తంలో షుగర్ ఎక్కువ కావడం వల్ల కంటిలోని లెన్స్ కొద్దిగా ఉబ్బుతుంది. దీనితో కళ్లు సరిగా ఫోకస్ చేయలేక మసకగా కనిపిస్తాయి. ఇది కళ్ళద్దాల నంబర్ పెరగడం కావచ్చు అనుకోకుండా, డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.

అకస్మాత్తుగా బరువు తగ్గడం: శక్తి కోసం కణాలకు చక్కెర అందనప్పుడు, శరీరం బదులుగా కండరాలు, కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. దీనివల్ల మీరు ప్రయత్నం చేయకుండానే వేగంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

గాయాలు మానడానికి ఎక్కువ సమయం: మీకు చిన్న దెబ్బ తగిలినా లేదా గాయం అయినా అది సాధారణం కంటే ఎక్కువ రోజులు తీసుకుంటే అది ప్రమాద సంకేతం. ఎక్కువ షుగర్ వల్ల రక్తనాళాలు దెబ్బతిని, రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అందుకే గాయాలు తొందరగా మానవు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.