ప్రపంచంలో అద్భుతమైన మెమరీ పవర్ ఉన్న జీవులు ఇవే

కొన్ని జంతువులను చూసినా, అవి చేసే పనులు తెలిసినా వెంటనే వాటిని తెగ పొగిడేస్తుంటాం కదా. నిజానికి కొన్ని జంతువులు మనం ఊహించిన దానికంటే చాలా తెలివితేటలు కలిగి ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకుంటాయి. కమ్యూనికేషన్ పెంచుకుంటాయి. ప్రమాదాలను ముందుగానే గుర్తిస్తాయి. ఇలాంటి చాలా గ్రేట్ క్వాలిటీస్ వాటికి ఉంటాయి. అలాంటి అరుదైన జీవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


చింపాంజీలు..
చింపాంజీలు మనుషులు, జంతువుల ముఖాలను అద్శుతంగా గుర్తుంచుకోగలవు. అది కూడా సాదాసీదాగా కాదు. ఎంతో కచ్చితత్వంతో మనుషులను ఎన్నేళ్ల తర్వాత చూసినా గుర్తుపట్టేంత మెమరీ పవర్ వీటికి ఉంటుందట. అంతేకాదు తాము సంపాదించుకున్న ఆహారాన్ని ఒక చోట దాచి వాటి కోసం ఎన్నేళ్ల తర్వాతైనా ఆ స్థావరానికి తిరిగి వెళ్లగలవట.

డాల్ఫిన్లు..
డాల్ఫిన్లు ఎంతో ప్రత్యేకమైన జలచరాలు. ఇవి మనుషుల మాదిరిగానే నవ్వగలవు. మనుషులను అమితంగా ఇష్టపడతాయి. డాల్ఫిన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు. ఎలా అంటే ఇవి ప్రత్యేకమైన ఈల శబ్దాలను చేస్తూ సంభాషించుకుంటాయి. ఆ శబ్దం మళ్లీ 20 ఏళ్ల తర్వాత వినిపించినా కూడా వాటిని కనిపెట్టగలవట.

ఏనుగులు..
ఏనుగులకు అసాధారణమైన లాంగ్ టర్మ్ మెమరీని కలిగి ఉంటాయి. ఇవి మనుషులను గుర్తుంచుకోగలవు. మనుషులతో వాటి అనుబంధాన్ని ఏనుగులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాయి. అడవిలో జీవించడానికి ఏనుగులకు తమ మెమరీ పవర్ ఎంతగానో ఉపయోగపడుతుందట.

కాకులు
కాకులకు హిందూ శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. వీటిని పితఈదేవతల స్వరూపంగా భావిస్తారు. అయితే, కాకులు మనుషుల ముఖాలను గుర్తుంచుకోగలవు. అంతేకాదు కాకులకు హాని కలిగించేవారిని గుర్తుంచుకుని వారి పట్ల కోపాన్ని కూడా పెంచుకుంటాయట. అందుకే కాకులతో కాస్త జాగ్రత్త.

గుర్రాలు..
గుర్రాలు మనుషుల వాయిస్ లను గుర్తుంచుకుని వాటి ద్వారా ముఖాలను కూడా గుర్తుపడతాయట. తమకు సేవలు చేసే నిర్వహకులను గుర్రాలు ఏళ్ల తరబడి మర్చిపోకుండా వారి కోసం ఎదురుచూస్తాయట. వీటికి ఉండే ఈ కెపాసిటీ వల్లే గుర్రాలకు ట్రైనింగ్ ఇవ్వడం సులువవుతుంది.