బ్యాంకు లోన్ క్లోజ్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన పత్రాలు ఇవే.. వీటిని అస్సలు మర్చిపోకండి.

బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చదువు రీత్యా, ఉద్యోగం, బిజినెస్, కారు, ఇళ్లు.. ఇలా వివిధ అవసరాల కోసం చాలామంది బ్యాంక్​ నుంచి రుణం తీసుకుంటారు.


దీనిని ఈఎంఐ రూపంలో కడుతూ ఉంటారు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా డబ్బు వచ్చినా.. లేదా ఈఎంఐలు పూర్తి అయినా లోన్​ క్లోజ్ అవుతుంది. ఆ సయమంలో బ్యాంక్​ నుంచి కొన్ని డాక్యూమెంట్స్ కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో.. వాటిని ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని సందర్భాల్లో లేక సరైన అవగాహన లేక బ్యాంక్​లో లోన్ క్లోజ్ చేసి దానికి సంబంధించిన పత్రాలు తీసుకోవడం మరచిపోతారు. అలా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకోకపోతే ఫ్యూచర్​లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి లోన్ పూర్తి అయిన తర్వాత బ్యాంక్​ నుంచి కచ్చితంగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసేద్దాం.

No Objection Certificate (NOC)

మీరు ఏ కారణంతో.. ఏ బ్యాంక్​ నుంచి అయినా లోన్ తీసుకుని.. దానిని క్లోజ్ చేసేప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్​లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఒకటి. ఇది మీరు బ్యాంక్​లో ఎలాంటి అవుట్​స్టాండింగ్ డ్యూస్ లేకుండా.. ఎలాంటి సమస్యలు లేకుండా లోన్​ని క్లోజ్​ చేసినట్లు బ్యాంక్​ ఇచ్చే సర్టిఫికెట్ ఇది.

Loan Closure Letter

మీరు తీసుకున్న లోన్ పూర్తి అయినట్లు బ్యాంక్​ కన్ఫార్మ్ చేస్తూ.. మీకు ఓ లెటర్ ఇస్తుంది. దానినే Loan Closure Letter అంటారు. మీరు పూర్తిగా డబ్బులు చెల్లించి.. లోన్ క్లోజ్ చేసినట్లు దీనిలో ఉంటుంది.

Final Repayment Statement

మీరు లోన్ క్లోజ్ చేసేప్పుడు చివరిగా చేసే పేమెంట్ స్టేట్​మెంట్ కచ్చితంగా తీసుకోవాలి. లోన్ క్లోజ్ అయితే ఈ స్టేట్​మెంట్ తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి.. మీరు కట్టిన పేమెంట్స్ స్టేట్​మెంట్ పూర్తిగా లోన్ చెల్లించినట్లు ఉండేలా స్టేట్​మెంట్ తీసుకోవాలి. దీనినే ఫైనల్ రీపేమెంట్ స్టేట్​మెంట్ అంటారు.

Release of Collateral

లోన్ సమయంలో ఫ్రూవ్​ కోసం, సెక్యూరిటీ కోసం మీరు బ్యాంక్​కి ఇచ్చిన పత్రాలు, ఆస్తి ఒప్పందం పత్రాలు, మొదలైన డాక్యుమెంట్స్ అన్ని లోన్ క్లోజ్ అయిన తర్వాత బ్యాంక్​ నుంచి వాటిని కచ్చితంగా తిరిగి తీసుకోవాలి.

బ్యాంక్​ లోన్ క్లోజ్ ముగించినప్పుడు ఈ డాక్యుమెంట్స్ కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఫ్యూచర్​లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని తీసుకుని లోన్​ క్లోజ్ చేసుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.