మనదేశంలో డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. వీరు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చూసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అధిక చక్కెర, అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను తినడం చాలా వరకు తగ్గించాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెంచని ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉంటే వారి వారసులు మొదట్నించి జాగ్రత్త వహించాలి. వారికి ఎప్పుడైనా ఈ రోగం వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు తమ మెనూలో కచ్చితంగా ఉండాల్సిన ఆహారాలను కొన్ని ఉన్నాయి.
తెల్ల బియ్యం, ఎరుపు, బ్రౌన్ రైస్ నుంచి క్వినోవాకు మారడం మంచిది. క్వినోవా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
మైదాను పూర్తిగా వాడడం మానేయాలి.
దీనికి బదులుగా జొన్నపిండిని వినియోగించాలి.
కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ వంటి కాయధాన్యాలు అధికంగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర పెరగకుండా పూర్తిగా అడ్డుకుంటుంది.
శనగ పప్పు, పెసరపప్పు వంటి పప్పులను వీలైనంత వరకు ఆహారంలో చేర్చుకోవాలి.
పాలకూర, కాలే వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోండి. బెర్రీ పండ్లను ప్రతి రోజూ తింటే మంచిది.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
బాదం, వాల్ నట్స్ వంటి గింజలను మెనూలో చేర్చుకోవాలి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను తినాలి. ఇది గుండెకు మేలు చేస్తుంది.
కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే వాటిని ప్రతి రోజూ తినాలి.
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో వెల్లుల్లి సమర్థవంతంగా పనిచేస్తుంది.
ప్రతి ఆహారంలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి వండుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు ఒక ఆర్డర్లో తినాలి. ముందుగా సలాడ్, వెజిటేబుల్స్, ఆ తర్వాత ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. పిండి పదార్థాలు , చక్కెర నిండి పదార్థాలను చివరిగా తీసుకోవాలి.
ఆకుకూరలు: బచ్చలికూర, కాలే, పాలకూర వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
బ్రోకలీ: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన బ్రోకలీ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.
అవోకాడో: అవకాడో పండ్లు తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
బెర్రీలు: స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీ పండ్లు వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో ఇతర పండ్లతో పోలిస్తే చక్కెర తక్కువగా ఉంటాయి.
నట్స్: వాల్ నట్స్, బాదం, పిస్తా వంటి వాటిలో రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలు ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.
చియా సీడ్స్: ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చియా విత్తనాలు అధికంగా ఉంటాయి.రక్తంలో చక్కెర స్థాయిలను ఇవి స్థిరంగా ఉండేలా చేస్తుంది.
పెరుగు: పెరుగులో కార్బోహైడ్రేట్లు కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన పెరుగును ప్రతిరోజూ ఒక కప్పు తినాల్సిన అవసరం ఉంది.
చేపలు: సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి రకాల చేపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇవి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లను అందిస్తాయి.
గుడ్లు: గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.ప్రతిరోజూ ఒక గుడ్డును తింటే ఎంతో మంచిది. గుడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్: ఆలివ్ నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
కాలీఫ్లవర్: కార్బోహైడ్రేట్లు దీనిలో తక్కువగా ఉంటాయి.దీనితో వండే ఆహారాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
దాల్చినచెక్క: దాల్చిన చెక్కను కేవలం మసాలానే అనుకుంటారు. దీనితో వండిన ఆహారాలను తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
దోసకాయలు: అధిక నీటి కంటెంట్ కలిగిన కూరగాయలు ఇవి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి.