ఏపీ ప్రభుత్వం పథకాల అమలు పై కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాల ఖరారు పైన అధికారులు ఫోకస్ చేసారు. అయితే, ఈ పథకం లబ్దిదారుల అర్హతలు.. వివరాల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ లోనూ నిధులు కేటాయించటంతో ఈ నెలలో లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
ఇలా చేయండి తల్లికి వందనం పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో.. ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ పథకం నిధులు పొందాలంటే రెండు ముఖ్యమైన లింకింగ్ ప్రక్రియలు తప్పనిసరి అని అధికారు లు స్పష్టం చేశారు. బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని, అదే విధంగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలను NPCI (National Payments Corporation of India)తో లింక్ చేయాలి సూచిస్తున్నారు. ఈ ఏడాది బడికి వెళ్లే ప్రతీ విద్యార్థి ఖాతాలో ఈ నిధులు జమ కానున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024 -25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు.
మార్గదర్శకాలు అయితే ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇక, ఈ పథకం అమలు కోసం దాదాపు రూ 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగ నుంది. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగు తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్ తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు.
ఈ నెలలోనే అమలు ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. అదే విధంగా విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. తల్లికి వందనం నిధులు జూన్ లో జమ అవుతాయని స్పష్టత వచ్చినా.. అర్హత, మార్గదర్శకాల పైన లబ్ది దారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.































