గత కొన్ని నెలలుగా బంగారం ధర ఎలా పెరుగుతుందో చెప్పనక్కర్లేదు. హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లి రికార్డ్ స్థాయి ధరలను తాకింది.
ఒక్కే ఏడాదిలోనే దాదాపు 60 శాతం కంటే ఎక్కుబ పెరిగింది. అంత ధర పెరిగినా కూడా కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. ఎందుకంటే బంగారం అనేది ఎంతో విలువైంది. ఇది కేవలం ఆభరణాలు లేదా అలంకరణలకే పరిమితం కాదు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఏ దేశమైనా ఆర్థికంగా బలంగా ఉండేందుకు బంగారం సహాయపడుతుంది. మరి అంత విలువైన బంగారాన్ని ప్రపంచంలోని ఏ దేశాలు అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయో తెలుసా? 2025 నాటి గ్లోబల్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో మన పొరుగున ఉన్న చైనా అగ్రస్థానంలో ఉంది. అత్యధికంగా 380.2 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. ఇక బంగారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా రెండవ స్థానంలో ఉంది. 330.0 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది.
284.0 టన్నుల బంగారం ఉత్పత్తితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. ఈ లిస్ట్‌లో కెనడా నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. 202.1 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తోంది.
ఇక అగ్రరాజ్యం అమెరికా ఈ లిస్ట్‌లో ఐదవ స్థానంలో ఉంది. అమెరికా 158.0 టన్నులు బంగారం ఉత్పత్తి చేస్తుంది. నెవాడా ఒక్కటే దాని మొత్తం బంగారం ఉత్పత్తిలో దాదాపు 75 శాతం అందిస్తుంది. అమెరికా తర్వాత ఆరో స్థానంలో ఘనా నిలిచింది. ఆఫ్రికాలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశం కూడా అదే. 140.6 టన్నులు ఉత్పత్తి చేస్తుంది.
మెక్సికో 140.3 టన్నులు బంగారం ఉత్పత్తి చేస్తూ 7వ స్థానంలో నిలిచింది. ఇక ఇండోనేషియా 140.1 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తూ 8వ ప్లేస్‌లో ఉంది. దక్షిణ అమెరికాలోని కీలకమైన మైనింగ్ దేశాలలో పెరూ ఒకటి ఇది 136.9 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తూ 9వ స్థానం ఆక్రమించింది. చివరిగా ఉజ్బెకిస్తాన్ 129.1 టన్నుల బంగారం ఉత్పత్తితో టాప్ 10వ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది.



































