ఓటీటీ లలో కొత్త కంటెంట్ పెరుగుతుంది. ప్రతి వారం కొత్ కథలు , కొత్త సినిమాలతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కళకళలాడిపోతున్నాయి. దీనితో మూవీ లవర్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. పైగా ఈ మధ్య కాలంలో తెలుగు కథలకు ఆదరణ లభించడం విశేషం. దీనితో మేకర్స్ కూడా మంచి మూవీస్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయనే లిస్ట్ కాకుండా వాటిలో ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.
సావి:
బాలీవుడ్ స్టార్ నటుడు అనిక్ కపూర్ , దివ్య కోశల , హర్ష వర్ధన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ.. మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఓటీటీ లోకి వచ్చిన వెంటనే ఈ మూవీ ట్రెండింగ్ లోకి రావడం విశేషం. భర్తను జైలు నుంచి తప్పించడం కోసం భార్య చేసే పోరాటమే ఈ మూవీ స్టోరీ లైన్. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీని చూడకపోతే ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మిస్ అయినట్లే.
మహారాజ :
విజయ్ సేతుపతి నటించిన ఈ మూవీ గత రెండు, మూడు వారాలుగా ట్రెండింగ్ లోనే నడుస్తుంది. నిన్నటి మొన్నటి వరకు టాప్ 1 లో కొనసాగిన మహారాజ స్థానాన్ని ఇప్పుడు సావి దక్కించుకోవడంతో.. ఈ సినిమా రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఆల్రెడీ ఈ సినిమాను దాదాపు అందరూ చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి.
మిస్టర్ అండ్ మిసెస్ మహి :
బాలీవుడ్ స్టార్స్ రాజ్ కుమార్ , జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమా మే 31 నథియేటర్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇలా ఓటీటీ లోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతూ.. టాప్ 3 లో నిలిచింది. భర్త
క్రికెట్ ఆడాలనే ఆశయాన్ని భార్య నెరవేరిస్తే ఎలా ఉంటుంది. ఆమె దానికి ఒప్పుకుంటుందా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. ఓ మంచి స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్ చూడాలని అనుకుంటే మాత్రం ఈ సినిమా చూసేయండి.
టారోట్ :
హర్రర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో అవంతిక వందనపు నటించిన హర్రర్ మూవీ టారోట్.. రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చి అప్పుడే ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. టారోట్ అనే ఒక గేమ్ ద్వారా ఆత్మలను పిలిచిన కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ ఎలా చనిపోయారు ఏదీ ఈ మూవీ కాన్సెప్ట్.
మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి:
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలను అందిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆయన ఒక సినిమా తీసే ముందు. ఏ రకంగా ఆలోచిస్తారు? ఎన్ని రకాలుగా దాని గురించి ఆలోచిస్తారు ? ఆయన దర్శకుడిగా మారిన ప్రాసెస్ లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేదే ఈ డాక్యుమెంటరీ కాన్సెప్ట్. గత వారమే ఓటీటీ లోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు టాప్ 5 స్థానాన్ని దక్కించుకుంది.
మహారాజ్ :
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, షాలిని పాండే కలిసి నటించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చి చాలా రోజులు అయింది. ఇక స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. విజయ్ సేతుపతి మహారాజ మూవీతో పాటు.. ఈ మూవీ కూడా రెండు వారల నుంచి ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం టాప్ 6 ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
శ్రీకాంత్:
నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కే సినిమాలకు ఎలాంటి డిమాండ్ ఉందొ తెలియనిది కాదు. ఈ క్రమంలో పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని .. అతను ఎలా ఈ స్థాయి వరకు ఎదిగాడు అనే విషయాలను ఈ మూవీలో చూపించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు వచ్చి చాలా రోజలు అయినా కానీ.. ఇంకా ట్రెండింగ్ లో ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ టాప్ 7 స్థానంలో కొనసాగుతుంది.
హసీనా దిల్‌రుబా :
నిజానికి తాప్సి నటించిన ఈ సినిమా వచ్చి మూడేళ్లు అయింది. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు ఈ మూవీ మళ్ళీ ట్రెండింగ్ లోకి రావడానికి కారణం ఈ సినిమాకు సిక్వెల్ గా ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీ ఈ వారం రిలీజ్ కావడమే. రెండవ పార్ట్ ను చూసే ముందు మొదటి పార్ట్ ను మరొక్కసారి చూసేస్తున్నారు ప్రేక్షకులు. దీనితో ఈ సినిమా టాప్ 8 ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
ఆడు జీవితం:
ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో.. ఓటీటీ లో కూడా అంతకంటే ఎక్కువ క్రేజ్ ను దక్కించుకుంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అయినా కానీ వాటిలో ఎదో ఒక లాంగ్వేజ్ మాత్రమే ట్రెండ్ అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం టాప్ 9,10 స్థానాల్లో కొనసాగుతుంది.