ఈ పండ్లతో బ్లడ్‌లో ఆక్సిజన్ పెరుగుతుంది.. తింటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు తగ్గుతాయి!

మనకు అన్నింటికంటే ముఖ్యమైనది ఆక్సిజన్. అందుకే దాన్ని ప్రాణవాయువు అంటారు. అది సరిగ్గా అందకపోతే రకరకాల అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి.. ఆక్సిజన్ బాగా అందేందుకు తినాల్సిన 7 రకాల పండ్లను చూద్దాం.


రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు మన శరీరానికి అతి ముఖ్యమైనవి. ఈ స్థాయిలు 95-100శాతం మధ్య ఉంటే, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందుతుంది. అప్పుడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆక్సిజన్ 90 శాతం కంటే తక్కువ స్థాయిలో ఉంటే అలసట, తలతిరగడం, శ్వాస అందకపోవడం, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయి. మంచి ఆక్సిజన్ స్థాయిలు.. రక్త ప్రసరణను మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎంజైమ్‌ల పనిని మెరుగుపరుస్తాయి. శ్వాసకోశ సమస్యలను నివారిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉండే పండ్లు.. హెమోగ్లోబిన్‌ను పెంచి, ఆక్సిజన్ రవాణాను మెరుగుపరుస్తాయి. ఇవి రక్త ప్రవాహాన్ని పెంచి, శరీరానికి మరింత ఆక్సిజన్ అందించడానికి సహాయపడతాయి. ఫలితంగా ఆస్తమా వంటివి రాకుండా ఉంటాయి. రోజువారీ ఆహారంలో ఈ పండ్లు చేర్చడం వల్ల శ్వాస వ్యవస్థ బలపడుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగవుతుంది. మరి అలాంటి 7 పండ్లను ఇప్పుడు చూద్దాం.

Watermelon:హైడ్రేషన్, లైకోపీన్‌తో నిండిన పుచ్చకాయ.. రక్త ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. ఇది ఆక్సిజన్ అందుబాటును పెంచి, శ్వాస సమస్యలను నివారిస్తుంది. రోజూ 200 గ్రాములు తినడం వల్ల శరీరం అంతటా ఆక్సిజన్‌ పూర్తిగా చేరుకుంటుంది. ఇదివరకు పుచ్చకాయలు వేసవిలోనే లభించేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీతో.. సంవత్సరమంతా పుచ్చకాయలు కాసేలా చేస్తున్నారు. డాక్టర్లు కూడా సంవత్సరమంతా పుచ్చకాయలు తినవచ్చు అంటున్నారు. ఐతే.. జలుబుతో ఉండేవారు పుచ్చకాయ తినకపోవడం మేలు.

Pomegranate:దానిమ్మ పండ్లు వానాకాలం, చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. వీటిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ గుణాల వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ అన్ని కణాలకూ చేరుతుంది. అలాగే ఈ పండ్లు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి కూడా. శరీరానికి మరింత శక్తి వచ్చేలా చేస్తాయి. రోజుకు ఒక పండు తినడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ 8 శాతం పెరుగుతాయి. రకరకాల అనారోగ్యాల నుంచి రక్షణ వస్తుంది. ఐతే.. ఈ పండ్లు, గింజలు ఎక్కువగా తింటే వేడి చేస్తాయి.

Oranges:మనకు మార్కెట్లలో ఎక్కువగా నారింజ పండ్లు లభిస్తాయి. ధర కూడా కొంత తక్కువగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రక్తం, ఆక్సిజన్‌ని బాగా తీసుకునేలా చేస్తుంది. శ్వాసకోశాలను రక్షిస్తుంది. శ్వాస బాగా ఆడేలా చేస్తుంది. రోజూ ఒక ఆరెంజ్ తినడం వల్ల రోజువారీ ఆక్సిజన్ అవసరాలు తీరతాయి. ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. ఐతే.. జలుబు ఉన్నవారు ఈ పండ్లను తింటే.. జలుబు వెంటనే కంట్రోల్ అవ్వకపోవచ్చు. అందుకే రాత్రిళ్లు ఈ పండ్లను తినవద్దు అని చెబుతుంటారు.

Strawberry:విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు.. రక్తంలో హెమోగ్లోబిన్‌ను పెంచుతాయి. ఇవి రక్త కణాలను బలపరుస్తూ, ఆక్సిజన్‌ను మెరుగుగా అందిస్తాయి. రోజువారీ 100 గ్రాములు తినడం వల్ల శ్వాస వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. తద్వారా బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కాకపోతే.. వీటి ధర ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ పండ్లను ప్రజలు అప్పుడప్పుడూ మాత్రమే కొంటారు. పైగా ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు.

Blueberry:డాక్టర్లు ఎక్కువగా తినమని చెప్పే పండ్లలో బ్లూబెర్రీస్ టాప్‌లో ఉంటాయి. ఈ ఖరీదైన పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే బ్లూబెర్రీలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి ఆక్సిజన్ రవాణాను పెంచి, శ్వాసకష్టాల్ని తగ్గిస్తాయి. రోజుకు ఒక కప్పు పండ్లను తినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు 5-10 శాతం పెరుగుతాయి. ఇవి ఆస్తమా రిస్క్‌ను 20 శాతం తగ్గిస్తాయి.

Avocado:ఆవకాడో పండ్లు అంత రుచిగా ఉండవు. పైగా ధర ఎక్కువ. లభ్యత తక్కువ. పండు.. పండిందో, లేదో పైకి తెలియదు. ఇలా చాలా సమస్యలు ఉన్నా.. ఈ పండ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E ఉంటాయి. అందుకే అవకాడో రక్త కణాలను బలపరుస్తుంది. ఇది ఆక్సిజన్ రవాణాను మెరుగుపరుస్తూ, శ్వాస వ్యవస్థను రక్షిస్తుంది. రోజుకు సగం అవకాడో తినడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

Grapefruit:విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రేప్ ఫ్రూట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీర కణాలు ఆక్సిజన్‌ని బాగా గ్రహించేలా చేస్తుంది. ఆస్తమా రిస్క్‌ను తగ్గిస్తాయి. రోజూ ఒక పండును తినడం వల్ల శరీరానికి తగిన ఆక్సిజన్ అందుతుంది. ఐతే.. ఈ పండు కొంత పుల్లగా ఉంటంది. కానీ ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల డాక్టర్లు దీన్ని తినమని సూచిస్తుంటారు. ఐతే.. కొంతమంది ఈ పండును తినకూడదు. కాబట్టి.. మీరు తినాలో వద్దో డాక్టర్ సలహా తీసుకోవాలి.

(Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత ఆరోగ్య నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.