Kidneys Health: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఖాయం!

శరీరంలోని అన్ని భాగాలూ చాలా ముఖ్యం. ఆరోగ్యంగా, అందంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతాయి.


అదే విధంగా శారీరక శ్రమ కూడా చాలా అవసరం. సరైన నిద్ర కూడా ముఖ్యం. మరి సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే.. ఎలాంటి వ్యాధులు మీ దరి చేరకుండా ఉంటాయి. కానీ కొన్ని రకాల అలవాట్ల వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. దీని వలన శరీరంలోని అన్ని భాగాలూ అనారోగ్య పాలవుతారు. ముఖ్యంగా కిడ్నీలపై ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. దీంతో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

శరీరంలోని మలినాలను, విష పదార్థాలు బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు సరైన విధంగా పని చేస్తేనే.. శరీరంలో ఎలాంటి విష పదార్థాలు ఉండవు. అనేక వ్యాధుల నుంచి రక్షించబడుతుంది. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా పని చేసేందుకు కూడా సరైన ఆహారం అవసరం. అయితే కొన్ని అలవాట్ల కారణంగా మూత్ర పిండాల పని తీరు అనేది దెబ్బతింటుంది. మరి ఆ అలవాట్లు ఏంటో.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు:

ఉప్పు అనేది శరీరానికి ముఖ్యం. అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనర్థాలకు దారి తీస్తుంది. ఉప్పులో సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో సోడియం కంటెంట్ ఎక్కువ అవుతుంది. దీని వల్ల కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఆల్కహాల్:

మద్యం సేవించడం వల్ల లివర్ మాత్రమే కాదు.. కిడ్నీలు కూడా పాడవుతాయి. మద్యాన్ని బయటకు పంపించడంలో కిడ్నీలకు చాలా సమయం పడుతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకు పోయి ప్రాణానికే ప్రమాదం రావచ్చు.

నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి:

చాలా మంది నీళ్లను చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. కిడ్నీలు ఆరోగ్యంగా పని చేయాలంటే నీళ్లు చాలా అవసరం. నీళ్లను సరిగ్గా తాగకపోతే.. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపలేవు.

జంక్ ఫుడ్స్:

జంక్ ఫుడ్స్, ఇన్‌స్టెంట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. వీటిల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నాలకు చేటు చేస్తుంది. కాబట్టి వీటికి చాలా దూరంగా ఉండాలి.