ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రోజుకో యాపిల్ తినలేని వారు ఒక ఉసిరి తింటే చాలని పెద్దలు చెబుతూ ఉంటారు., అయితే కాయలు మాత్రమే.. ఉసిరి ఆకులతో కూడా శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
ఎన్నో రకాల వ్యాధుల నయం చేయడంలో ఉసిరి ఆకులు మెడిసిన్‌లా పనిచేస్తాయి. ప్రమాదకర హెపటైటిస్ వంటి వ్యాధులకు కూకు ఉసిరాకుతో చెక్ పెట్టవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఉసిరి ఆకులు వగరగా ఉంటాయి. కాస్త తీపి రుచి కూడా మిళితం అయినట్లు ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 3 రకాల దోషాలు ఉంటాయి. వాత, పిత్త, కఫ. ఈ దోషాలకు విరుగుడు ఉసిరి ఆకు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఉసిరి ఆకులు పప్పు వంటి వాటిల్లో వేసుకోవచ్చట. ఇక పొడిలాగా మార్చి కూడా వినియోగించవచ్చట. బ్లడ్ డిజార్డర్స్, ఇన్ఫ్లమేషన్, మలేరియా, యూరినరీ ట్రాక్ట్ ఇనెఫెక్షన్ వంటి 120 వ్యాధుల చికిత్సలో ఉసిరి ఆకులు ఉపయోపడతాయని చెబుతున్నారు.
ఉసిరి ఆకుల పొడి తీసుకుంటే.. కడుపులో అల్సర్ వంటి సమస్యలు నయమవుతాయట. ఉసిరి ఆకుల్లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-వైరల్ లక్షణాల వల్ల లివర్ డ్యామేజ్ నుంచి బయటపడొచ్చు. అలానే లివర్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. ఉసిరితోని పోషకాలు.. కాలేయ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఉసిరి ఆకల పొడిని తీసుకోవడం వల్ల దగ్గు, కఫం, జ్వరం వంటి లక్షణాల నుండి రిలీఫ్ ఉంటుంది. ఉసిరి బాడీలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
అలానే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు ఉసిరి ఆకుల పొడి తినడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయట. కిడ్నీ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు పిత్తాశయ రాళ్ల నివారణలోనూ ఉసిరి ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.