ఈ అర్హతలుంటే చాలు.. 3334 Govt జాబ్స్ రెడీ.. కాంపిటీషన్ తక్కువ

www.mannamweb.com


గవర్నమెంట్ జాబ్స్ కు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే లక్షలాది మంది పోటీపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అయితే సెక్యూరిటీ ఉంటుంది. ప్రైవేట్ రంగంలో అయితే శాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ సెక్యూరిటీ ఉండదు. ఎప్పుడు జాబ్ ఊడుతుందో తెలియదు. నిత్యం టెన్షన్ పడుతూ ఉండాలి. ఇలాంటి తరుణంలో తక్కువ కాంపిటీషన్ ఉన్న జాబ్ కొట్టే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. తెలంగాణలో 3334 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీకు ఈ అర్హతులున్నాయంటే చాలు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఇప్పటికే రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌).. పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఇటీవల 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులు, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో 13 పోస్టులు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్‌ 5.

అర్హతలు:

జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల రిజిస్టర్‌ చేసుకొని ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు.. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచారు.

పే స్కేల్:

నెలకు రూ.36,750 – రూ.1,06,990 ఉంటుంది.

ఎంపిక విధానం:

రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌

దరఖాస్తు ప్రారంభం:

28-09-2024

దరఖాస్తు చివరి తేదీ:

14-10-2024