టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితులు వారే.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు..!

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జూలై 3న ఈ ఘటనకు సంబంధించి 5 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మంగళగిరి పోలీసులు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మరికొందరి కోసం గాలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జూలై 3న ఈ ఘటనకు సంబంధించి 5 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మంగళగిరి పోలీసులు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మరికొందరి కోసం గాలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని గుంటూరుకు చెందిన బత్తుల దేవానంద్, వెంకటరెడ్డి, గిరి రాము, ఖాజా మొయినుద్దీన్, మస్తాన్ వలిగా గుర్తించారు. CC ఫుటేజ్‌, ఇతర ఆధారాలతో ఆరోజు దాడికి పాల్పడిన వారిలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు పోలీసులు. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం (సత్యనారాయణ), అంబేద్కర్‎తో సహా మరి కొందరిని గుర్తించించామన్నారు. త్వరలో మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్‌ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను గత మూడు, నాలుగు రోజులుగా సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైఎస్ఆర్సీపీ కౌంటర్ చేస్తోంది. ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్ట్‌ చేశామని చెప్తున్నారని.. అక్రమ అరెస్ట్‌లపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.