29-31 తేదీల్లో వీరికి సెలవులు లేవు …ఆఫీస్ లు ఓపెన్

దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ కార్యాలయాలు మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు (సెలవు రోజుల్లోనూ) తెరిచే ఉంటాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది.


ఆర్థిక సంవత్సరం ముగింపు రోజుల్లో ఆదాయపన్నుకు సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తి చేసుకునేందుకు వీలుగా కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

మార్చి 30న ఉగాది ఆదివారం, 31న రంజాన్‌ కారణంగా సెలవు కావడం తెలిసిందే. ఆదాయపన్ను శాఖకు సంబంధించి మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకునేందుకు కార్యాలయాలను తెరిచి ఉంచుతున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు అయిన మార్చి 31న ప్రభుత్వ చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 2023-24 అసెస్‌మెంట్‌ సంవత్సరం అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువు కూడా మార్చి 31తో ముగియనుంది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంక్‌లు మార్చి 31న కార్యకలాపాలు నిర్వహించాలంటూ ఆర్‌బీఐ సైతం ఆదేశించడం గమనార్హం.