కూర్మగ్రామం శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 24, 25న సహజ వ్యవసాయ వర్క్‌షాప్, శ్రీ దార్లపూడి రవి శిక్షణ, ఉచితంగా యువతకు ఆధ్యాత్మికతతో వ్యవసాయ అవగాహన.
సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయం అంటే నేటి యువతకు పెరుగుతున్న ఆసక్తి. ప్రకృతి పట్ల ప్రేమ, రసాయనాల వల్ల భూమి నష్టపోతున్న బాధ, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన ఈ మూడూ కలిసి నేటి తరం మట్టిమణియాల రక్షకులుగా ముందుకు రావాలని ప్రేరేపిస్తున్నాయి. అలాంటి యువతకు ఇప్పుడు ఒక అపూర్వమైన, అరుదైన, జీవితం మార్చే అవకాశం వచ్చింది. కూర్మగ్రామము నిర్వహిస్తున్న 2 రోజుల సహజ వ్యవసాయ వర్క్‌షాప్.
నవంబర్ 24 & 25, 2025 న కూర్మగ్రామం వైదిక గ్రామం, శ్రీముఖలింగం సమీపంలో, శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న ఈ శిక్షణా శిబిరం, కేవలం వ్యవసాయ పద్ధతులను నేర్పే కార్యక్రమం మాత్రమే కాదు, ప్రకృతి, భక్తి, సుస్థిర జీవనాన్ని ఏకం చేసే పవిత్ర ప్రదేశం. ‘‘సరళ జీవనం ఉన్నత ఆలోచన’’ అనే వేద తత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ గ్రామం, యువతకు దారి చూపే ఆధ్యాత్మిక క్షేత్రం.
ఈ వర్క్‌షాప్ ప్రధాన శిక్షకులు శ్రీ దార్లపూడి రవి గారు, స్వదేశీ విత్తనాల సంరక్షణలో అద్భుత విప్లవం సృష్టించిన ప్రముఖ సహజ వ్యవసాయ నిపుణులు. కార్పొరేట్ జీవితం విడిచి, భూదేవిని రక్షించాలనే సంకల్పంతో సహజ వ్యవసాయం వైపు ప్రయాణించిన రవి గారు ఇప్పటివరకు 3,600 కంటే ఎక్కువ స్వదేశీ విత్తనాలను రక్షించి ప్రత్యేక జర్మ్‌ప్లాస్మ్ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా రైతులకు శిక్షణ అందించి, మిశ్రమ పంటలు, రైన్‌లెస్ వ్యవసాయం, రసాయన రహిత పద్ధతులను ప్రచారం చేశారు. ఆయన రూపొందించిన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు ‘భాస్కర’ పేరుతో ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం AP స్టేట్ అగ్రికల్చర్ టీచర్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ శిబిరంలో నేర్ప అంశాలు యువతకు వ్యవసాయంపై సమగ్ర అవగాహన ఇస్తాయి. సహజ వ్యవసాయం పద్ధతులు, జీవామృతం తయారీ, రసాయన రహిత పంటలు, మిశ్రమ పంటల వ్యవస్థ, సహజ పురుగు నియంత్రణ పద్ధతులు, కంపోస్ట్ తయారీ, స్వదేశీ విత్తనాల నిల్వ, గ్రామస్థాయి సీడ్ బ్యాంకుల ఏర్పాటు వంటి అమూల్యమైన విషయాలు చేర్చబడ్డాయి. ప్రతి అంశం వ్యవసాయ భవిష్యత్తును మార్చగలదని నిపుణులు చెబుతున్నారు.
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడం పూర్తిగా ఉచితం. ఆహారం, వసతి విరాళాల రూపంలో నిర్వహించబడుతుంది. వర్క్‌షాప్ పురుషులకే అందుబాటులో ఉంది. ప్రతిరోజూ మంగళహారతి, జపం, గురుపూజ, కీర్తనలతో ఆధ్యాత్మికత నిండిన దినచర్య కొనసాగి, టెక్నికల్ సెషన్లలో వ్యవసాయం నేర్పబడుతుంది.
కూర్మగ్రామ నియమాలు ఎంతో ఆదర్శవంతమైనవి శాంతిని కాపాడటం, సాంప్రదాయ దుస్తులు ధరిచడం, నాలుగు నియమాలను పాటించడం, జంతువులు–ప్రకృతిని గౌరవించడం, పరిశుభ్రతను కాపాడటం. ఇవన్నీ యువతకు క్రమశిక్షణతో కూడిన నిజమైన జీవన విలువలను నేర్పుతాయి.
కూర్మగ్రామం కేవలం శిక్షణా కేంద్రం కాదు ప్రకృతి, భక్తి, వైదిక జీవన శైలిని పునరుద్ధరించే పవిత్ర ప్రదేశం. ఇక్కడి వాతావరణం యువతలో ఆత్మవిశ్వాసం, ధర్మపరమైన దృక్కోణం, ప్రకృతితో అనుబంధం పెంచుతుంది. వ్యవసాయ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునేవారికి లేదా తమ స్వగ్రామంలో మార్పు తీసుకురావాలనుకునే యువతకు ఇది జీవితాన్ని మార్చే చాన్స్. నమోదు కోసం: 77320 75607ఆన్‌లైన్ లింక్:(https://docs.google.com/forms/d/e/1FAIpQLSf9adPlbpHydNL7opwOuIeOvueyoM3_DHDdN5i75u3LdQLjYA/viewform

































