హైదరాబాద్ లోని ఈ ప్రాంతంలో కేవలం రూ. 75 లక్షలకే డుప్లెక్స్ విల్లా ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరం నలువైపులా రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది.


ముఖ్యంగా నగరంలో రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు భూముల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం వేలంపాటలో 177 కోట్ల రూపాయలకు ఒక ఎకరం చొప్పున విక్రయించింది. దీనిబట్టి హైదరాబాద్ నగరంలో ఏ రేంజ్ లో అభివృద్ధి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ నగరం తో పాటు చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు అవతలి వైపు ఉన్నటువంటి కోకాపేట కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందన్న సంగతి గుర్తించాల్సిందే. నిజానికి హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరగడానికి ప్రధాన కారణం ఐటీ రంగం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విస్తరించింది. ఈ కారణంగానే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రంగ నిపుణులు హైదరాబాద్ నగరంలో స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

హైదరాబాద్ నగరం భారత దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీగా పేరు సంపాదించుకుంది. హైదరాబాద్ నగరంలో ఎంత విస్తరణ జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలోని పశ్చిమ ప్రాంతం వైపు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి కేంద్రీకృతం అయింది అని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో నగరంలోని ఇతర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అతి తక్కువ ధరకే డూప్లెక్స్ విల్లా ఇండిపెండెంట్ ఇల్లు ఎక్కడ కొనుగోలు చేయవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలోని తూర్పు, ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి షామీర్పేట్ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డు కు అత్యంత సమీపంలో ఉంది. ఈ ప్రాంతం గుండా హై కరీంనగర్ హైవే వెళుతుంది. ఈ హైవే చుట్టుపక్కల పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నట్లు గమనించవచ్చు. హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలతోపాటు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి.

షామీర్పేట్ సమీపంలో ఉన్నటువంటి తుర్కపల్లి గ్రామంలో ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు తక్కువలో ఉన్నాయని చెప్పవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి డూప్లెక్స్ విల్లాల ధరలు 70 లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ ప్రాంతం చక్కటి కనెక్టివిటీ ఉండటంతో పాటు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది అని చెప్పవచ్చు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం భవిష్యత్తులో చక్కటి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది అని చెప్పవచ్చు.

Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకుపెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని  పాఠకులకు సూచిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.