ఆ జబ్బులు ఉన్నవారికి ఈ చేప ఒక వరం.. ప్రపంచంలోనే ఖరీదైన చేప ఇదే..! కేజీ ధర ఎంతంటే ?

ఈ చేప ప్రపంచంలోనే ఖరీదైనది. అంతేకాదు అరుదైనది కూడా. దీని కేజీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు. అంతేకాదండోయ్.. కొన్ని రకాల జబ్బులతో బాధ పడుతున్నవారికి ఈ చేప ఒక మెడిసిన్‌లా పనిచేస్తుందట. మరి ఆ చేప ఏంటో చేసేద్దామా..


ఇండియాలో చాలా మంది చేపల వేటపై ఆధారపడి జీవించే జాలర్లు ఉన్నారు. రోజూ సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్తుంటారు. అయితే అప్పుడప్పుడూ వారి వలల్లో చేపలే కాకుండా అదృష్టం కూడా పడుతుంటుంది! అరుదుగా భారీ ధర పలికే మత్స్య సంపద చిక్కుతుంటుంది. తాజాగా పశ్చిమ్‌ బెంగాల్‌, దిఘా (Digha)లోని కాంతి దేశ్‌ప్రాన్ బ్లాక్‌కు చెందిన మత్స్యకారుడు సుభాష్ చంద్ర జానా, అతని బృందానికి ఇలాంటి రోజే ఎదురైంది. నాగరాజ్ అనే తమ ట్రాలర్ నౌకలో సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు, వలలో  కిలోల బరువున్న అరుదైన ‘తెలియా భోలా చేప’ (Telia Bhola fish) పడింది. దాన్ని ఏకంగా రూ.2,16,000కు అమ్మారు. అంటే కిలో రూ.12,000 పలికింది.

అరుదైన, విలువైన చేప..: తెలియా భోలా అనేది డీప్‌ వాటర్‌ ఫిష్‌. చాలా అరుదుగా దొరికే ఈ చేపకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. ఎండబెట్టిన దాని స్విమ్‌ బ్లాడెర్‌ (Dried swim bladder)లో కొల్లాజెన్‌ ఉంటుంది. దీనితో బ్యూటీ, హెల్త్‌ ప్రొడక్టులు తయారు చేస్తారు. ముఖ్యంగా యాంటీ-ఏజింగ్‌కి పాపులర్‌ అయిన ప్రొడక్టుల్లో వినియోగిస్తారు. అందుకే ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఈ చేపలు భారీ ధర పలుకుతాయి.

ఇది చాలా చిన్న చేప అయినా మంచి ధర పలికిందని దిఘా ఫిషర్మెన్ అండ్‌ ఫిష్ ట్రేడర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ నవ్‌కుమార్ పయార్య చెప్పారు. 2021లో 75 కిలోగ్రాముల బరువున్న తెలియా భోలా చేపను రూ.36 లక్షలకు అమ్మినట్లు గుర్తుచేసుకున్నారు. అంటే కిలో ఏకంగా రూ.49,300 చొప్పున అమ్ముడుబోయింది.

ఈ సీజన్‌లో జాలర్లకు కష్టాలే!..:  ఈ సంవత్సరం దిఘాలో చేపల వేట సీజన్ కఠినంగానే ఉంది. బలమైన గాలులు లేకపోవడం వల్ల చాలా కాలంగా ఎదురుచూస్తున్న హిల్సా (లేదా ఇలిష్) సీజన్ నెమ్మదిగా ప్రారంభమైంది. గాలులు ఎక్కువగా లేకపోవడం వల్ల తక్కువ చేపలు పడ్డాయి. చాలా మంది మత్స్యకారులు ఈ సీజన్‌లో చాలా తక్కువ లాభాలు పొందారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితిలో తెలియా భోలా చేప దొరకడం ఒక పెద్ద ఉపశమనం. జానా అదృష్టవశాత్తూ చేపలు పట్టాడనే వార్త దిఘా ఆక్షన్‌ సెంటర్‌లో త్వరగా వ్యాపించింది. అందరి మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వును తీసుకొచ్చింది. ప్రస్తుతానికి అరుదైన తెలియా భోలా నెమ్మదిగా సాగుతున్న సీజన్‌ను పాజిటివ్‌గా మార్చింది.

భారీ డిమాండ్‌ ఎందుకు?..:తెలియా భోలా చేపను సైంటిఫిక్‌గా ప్రోటోనిబియా డయాకాంతస్ లేదా సాధారణంగా బ్లాక్‌ స్పాటెడ్‌ క్రోకర్ అని కూడా పిలుస్తారు. ఇది ఒడిశా నుంచి సుందర్బన్స్ వరకు బంగాళాఖాతం తీరం వెంబడి ప్రధానంగా కనిపించే అరుదైన చేప. పర్షియన్ గల్ఫ్, ఆస్ట్రేలియాలోని పసిఫిక్ తీరం వంటి ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. ఈ చేప 30 నుంచి 35 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు పెరుగుతుంది.

తెలియా భోలా స్విమ్‌ బ్లాడర్‌తో పాటు చేప నూనె, పిత్తం, ఇతర భాగాలను లైఫ్‌ సేఫింగ్‌ మెడిసిన్స్‌, యాంటీ-ఏజింగ్ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తారు. గుండె జబ్బుల ప్రమాదం తగ్గించడం, కీళ్ల నొప్పులను తగ్గించడం, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ చేయడానికి ఉపయోగించే హెల్త్‌ సప్లిమెంట్స్‌, మెడిసిన్‌లో కూడా వాడుతారు. దీని మెడిసినల్‌ ఇంపార్టెన్స్‌ కారణంగానే మార్కెట్లో చాలా ధర పలుకుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.