ఈ రోజు గణపతికి మందార పువ్వుతో పూజ చేయడం అత్యంత ఫలప్రదం అని నమ్మకం. మందార పువ్వు పూజకు మాత్రమే కాదు దీనిలో ఔషద గుణాలున్నాయి. ఈ పువ్వులో అనేక రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
ఇది ఆరోగ్యానికి, జుట్టుకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
చర్మం కోసం ఫేస్ ప్యాక్: మందార పువ్వులను ఉపయోగించి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. మందార పువ్వును మెత్తగా చేసి దానిలో రోజ్ వాటర్ కలుపుకుని చర్మానికి అప్లై చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
టోనర్: మంచి స్కిన్ టోనర్ కూడా.. దీని కోసం మీరు మందార పువ్వులను నీటిలో ఉడకబెట్టి.. చల్లారిన తర్వాత టోనర్‌గా ఉపయోగించవచ్చు.
జుట్టు కోసం: మంచి ఒత్తైన జుట్టు కోసం హెయిర్ మాస్క్‌గా మందార పువ్వులను ఉపయోగించవచ్చు. మందార పువ్వులో కొబ్బరి నూనె లేదా పెరుగును జోడించి 25 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ పేస్ట్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.