లాంగ్ గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శతక్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటిస్తున్నాడు.
UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా అనుష్క శెట్టి మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘ఘాటీ మూవీ ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్జైటింగ్‌గా ఉంది. అందులో నేను శీలావతి క్యారెక్టర్‌లో చేస్తున్నా. ఇదొక అమేజింగ్ పాత్ర. ఇలాంటి క్యారెక్టర్‌ని నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. కంఫర్ట్ జోన్‌ని దాటి చేసిన సినిమా ఇది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి.. ఈ సినిమాలన్నిటిలోనూ చాలా బలమైన పాత్రలు చేశాను. ఘాటిలో చేసిన శీలావతి క్యారెక్టర్ కూడా అంత బలంగా ఉంటూనే ఒక డిఫరెంట్ షేడ్ తో ఉంటుంది. క్రిష్ గారు అలాంటి ఒక బలమైన పాత్రని తీర్చిదిద్దారు. ఘాటీ కథ విన్నప్పుడు ఆ కల్చర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. లొకేషన్స్‌కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్, కల్చర్, ఒక కొత్త విజువల్‌ని ఆడియన్స్‌కి చూపించబోతున్నామనే ఎక్జైట్మెంట్ కలిగింది. క్రిష్ నాకు ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందులో శీలావతి క్యారెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అంటూ మరిన్ని విశేషాలు పంచుకున్నారు.
































