ఇది 5 సంవత్సరాలలో మీకు రూ. 14 లక్షలు ఇచ్చే సూపర్ డూపర్ పథకం.

నేటికాలంలో చాలా మందిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. మారుతున్న అవసరాలు, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో పొదుపు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.


అయితే పొదుపు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే మార్గాలను అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ అనేక రకాల స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. పోస్టాఫీస్ లో అందుబాటులో ఉన్న అలాంటి ఒక బెస్ట్ స్కీమ్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్.

కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ ఈ ఆర్డీ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గా చెప్పుకునే ఈ సేవింగ్ స్కీమ్ ఇన్వెస్టర్లకు ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడిని అందిస్తోంది. ఈ స్కీములో నెల రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రిటర్న్ కూడా పొందవచ్చు. దీనికపై వడ్డీ ప్రయోజనం కూడా స్థిరంగా ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5ఏళ్లు. ఒకవేళ మధ్యలో తీసుకోవాలనుకుంటే 3ఏళ్లు నిండిన తర్వాత తీసుకోవచ్చు. అయితే వడ్డీ చాలా తగ్గుతుంది. లేదంటే లోన్ కూడా తీసుకోవచ్చు.

ఒక వేళ మీరు 5ఏళ్లలో రూ. 14లక్షలు పొందాలని టార్గెట్ పెట్టుకున్నట్లయితే మీరు ఆర్డీ స్కీములో నెలకు రూ. 20వేలు పొదుపు చేయాలి. ఇలా ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ. 12,00, 000 అవుతుంది. అయితే మీరు సుమారు రూ. 2,27,320 వడ్డీ రూపంలో లభిస్తుంది. ఇలా మొత్తం రూ. 14,27,320 మీ సొంతం అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా లెక్కిస్తే ఒకవేళ్ల భవిష్యత్తులో వడ్డీ రేట్లలో మార్పులు జరిగితే మీకు వచ్చే రిటర్న్స్ దానికి అనుగుణంగా మారుతాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ కు 6.7శాతం వడ్డీ లభిస్తోంది.

ఆర్డీ స్కీములో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా పోస్టాఫీస్ కు వెళ్లి ఆర్డీ అకౌంట్ తీసుకునేందుకు ఫామ్ నింపాలి. దీనికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక పాస్ట్ పోర్ట్ సైజు ఫోటో అవసరం ఉంటుంది. నామినీ పేరును అందించాలి. కనీసం రూ. 100తో అకౌంట్ ను ఓపెన్ చేయాలి. ప్రతీనెలా కొంత మొత్తం పొదుపు చేస్తే వెళ్లే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.