తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తొలి గద్దర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించాడు. ఇది తనకో గొప్ప గౌరవమని అతడు అన్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు.
అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై గురువారం (మే 29) అతడు తన ఇన్‌స్టా ద్వారా స్పందించాడు. పుష్ప 2 మూవీకిగాను అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. మరి దీనిపై అతడు ఏమన్నాడో ఒకసారి చూడండి.
అల్లు అర్జున్ ఏమన్నాడంటే..
తనకు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించాడు. తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో పుష్ప 2 కోసం నాకు తొలి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు ఇలా..
2024 ఏడాదికి సంబంధించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రభుత్వం గురువారం (మే 29) అనౌన్స్ చేసింది. జ్యూరీ ఎంపిక చేసిన అవార్డీల జాబితా ఇక్కడ చూడండి.
ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి 2898 ఏడీ
ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్
ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటిగా నివేదిత థామస్ (35)
ఉత్తమ దర్శకుడుగా నాగ్ అశ్విన్
ఉత్తమ గాయని శ్రేయ ఘోషల్
బెస్ట్ స్ర్కీన్‌ప్లే -వెంకీ అట్లూరి
బెస్ట్ కొరియోగ్రాఫర్- గణేశ్ ఆచార్య
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్
స్పెషల్ జ్యూరీ అవార్డు- దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరీ అవార్డు- అనన్య నాగళ్ల (పొట్టేల్)
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్జులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ జ్యూరీ(కమిటీ)కి ఛైర్మన్ గా టాలీవుడ్ సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు. కమిటీలో సభ్యులుగా 15 మందికి అవకాశం కల్పించారు.
































