వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను ఇలా చూడవచ్చు..ఈ ఈజీ ట్రిక్ చాలామందికి తెలియదు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్(Whatsapp)ని ఉపయోగిస్తుంటారు. దీంతో మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు సులభంగా షేర్ చేసుకోవచ్చు. యాప్‌లో కాలింగ్, వీడియో కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.


గోప్యతని దృష్టిలో ఉంచుకుని యాప్‌లో అనేక గోప్యతా ఆధారిత ఫీచర్‌లు కూడా అందించబడ్డాయి. అలాంటి ఒక ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్. దీని కారణంగా, రిసీవర్, పంపిన వారి చాట్‌ల నుండి మేసేజ్ లు డిలీట్ అయిపోతాయి.

కానీ, ఇది తొలగించబడిన మేసేజ్ ల జాడను వదిలివేస్తుంది. కొన్ని మేసేజ్ లు పంపబడినట్లు, తొలగించబడినట్లు చూపుతుంది. చాలా మంది డిలీట్ అయిన మెసేజ్ లలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడం ప్రమాదకరం. అందువల్ల Android ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు చూద్దాం, దీని ద్వారా తొలగించబడిన మెసేజ్ లను చదవవచ్చు.

తొలగించబడిన టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే దీని ద్వారా చెక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఫోటోలు లేదా ఆడియో సందేశాలకు ఉపయోగపడదు. అలాగే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11, అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

డిలీట్ అయిన మెసేజ్ లను ఇలా చదవండి:

ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

తర్వాత నోటిఫికేషన్‌లపై నొక్కండి.

దీని తర్వాత మరిన్ని సెట్టింగ్‌లకు(More settings) వెళ్లండి.

ఆపై నోటిఫికేషన్‌ల చరిత్రకు(Notifications history) వెళ్లండి.

ఆపై స్క్రీన్‌పై కనిపించే టోగుల్‌ను ఆన్ చేయండి.

ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, మీరు మళ్లీ Nnotifications ద్వారా నోటిఫికేషన్‌ల హిస్టరీకి వెళ్తారు. దీని ద్వారా మీరు 24 గంటల్లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసేజ్ లను చూస్తారు.