21 రోజులు, 11 స్టాప్‌లు.. బాబోయ్.! బాహుబలి రైలు బండి ఇది.. టికెట్ ధర తెలిస్తే మైండ్ తిరుగుద్ది

భారత్‌లో అతి పొడవైన రైలు మార్గం అంటే దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ గురించి అని చాలా మందికి తెలుసు. ఇది దాదాపు 80 గంటల 15 నిమిషాల్లో 4,273 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.


తొమ్మిది రాష్ట్రాల గుండా వెళుతుంది. అలాగే దాదాపు 55 స్టేషన్లలో ఆగుతుంది. కానీ మనం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో లండన్ నుంచి సింగపూర్ వరకు రైలు మార్గం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పుడు, ఆ రికార్డును పోర్చుగల్ నుంచి సింగపూర్ మార్గం బద్దలు కొట్టింది.

ఈ రైలు ఏకంగా18,755 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 21 రోజులు పడుతుంది. వాతావరణం అనుకూలతలు సరిగ్గా లేకపోతే.. ప్రయాణం కొన్నిసార్లు మూడు వారాల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ బాహుబలి రైలు ప్రయాణం పోర్చుగల్‌లోని అల్గార్వే ప్రాంతంలోని లాగోస్‌ నుంచి ప్రారంభమై సింగపూర్‌లో ముగుస్తుంది. మార్గం గుండా రైలు 13 వేర్వేరు దేశాల దాటుతుంది. కేవలం 11 ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలు మార్గంలో స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు తగులుతాయి. పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ వంటి ప్రసిద్ధ నగరాల్లో ఈ రైలు ఆగుతుంది. ఈ ప్రధాన స్టాప్‌లలో రైలు రాత్రిపూట హాల్ట్ అవుతుంది. తద్వారా ప్రయాణీకులు ఆయా నగరాలలోని పర్యాటకాన్ని వీక్షిస్తారు. స్థానిక సంప్రదాయాల గురించి తెలుసుకుంటారు. ఈ ట్రైన్ టికెట్ ధర దాదాపుగా1,350 డాలర్లు(సుమారు రూ. 1.14 లక్షలు). మీకు టికెట్‌తో పాటుగానే లగ్జరీ సర్వీసులన్నీ లభిస్తాయి. భోజనం, డ్రింక్స్, వసతి ఇలా అన్ని ఉంటాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.