నిత్యం వినియోగించే వస్తువుల ధరలు పెరిగితే అవి వాడేవారు ఆందోళన చెందుతారు, ఎందుకిలా పెంచుతున్నారంటూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. కానీ, ఒక్క మద్యం వినియోగదారులు మాత్రం పాపం ఎంత ధర పెరిగినా ఎలాంటి కంప్లైయింట్ చేయరు.
అయితే ప్రస్తుతం మద్యం ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఫుల్లు తాగే వారు.. అధిక ధరలతో ఇప్పుడు హాఫ్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. లేదా గతంలో కాస్ట్లీ మద్యం తాగిన వారు ఇప్పుడు కాస్త తక్కువ రేటు మందు తాగుతున్నారు. అలాంటి వారందరికీ ఒక సూపర్ న్యూస్ ఏంటంటే.. ఒక చోట మద్యం కేవలం రూ.35లకే లభిస్తుంది.
ప్రపంచంలో అత్యంత చౌకైన మద్యం ఇదే. వియత్నాం దేశంలో ఈ చౌకైన మద్యం లభిస్తుంది. వియత్నాంలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన మద్యం ఉంది, దీని ధర కేవలం 35 రూపాయలు. వియత్నాం తర్వాత అత్యంత చౌకైన ఆల్కహాల్ ఉక్రెయిన్‌లో లభిస్తుంది. ఉక్రెయిన్‌లో కేవలం 45 రూపాయలకే మద్యం దొరుకుతుంది. అదేవిధంగా ఆఫ్రికన్ దేశమైన జాంబియాలో కూడా చౌకైన ఆల్కహాల్ అందుబాటులో ఉంది, ఇక్కడ ఒక బాటిల్ ధర దాదాపు 75 రూపాయలు.
































