షారుఖ్ ఖాన్ తన డైట్లో ఉదయాన్నే మొలకలు తీసుకుంటారు. 100 గ్రాముల మొలకలలో దాదాపు 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
పోషకాలతో నిండిన మొలకలు మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి.
గ్రిల్డ్ చికెన్ తీసుకుంటారు. ఇది లీన్ ప్రోటీన్‌కి ప్రధాన వనరు. వయస్సు పెరిగే కొద్దీ కండర ఆరోగ్యం కోసం దీనిని తీసుకోవాలి. 100 గ్రాముల గ్రిల్డ్ చికెన్లో దాదాపు 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల మరమ్మత్తునకు, శక్తికి మేలు చేస్తుంది.
బ్రోకలీ కూడా డైట్లో ఉంటుంది. దీనిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పేగులకు అనుకూలమైనది. చర్మం మెరుపును పెంచడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా షారుఖ్ అప్పుడప్పుడు కొంచెం పప్పు కూడా తింటాడు. డాక్టర్ పాల్ ప్రకారం.. పప్పులో ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇవి డైట్‌ను మరింత సమతుల్యం చేస్తాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. షారుఖ్ ఫిట్నెస్ రహస్యం గట్ ఆరోగ్యం. గట్ హెల్త్ బాగున్నప్పుడు చర్మం మెరుస్తూ ఉంటుంది. మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది. 2022లో నేచర్ ఏజింగ్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ వాపును తగ్గిస్తుందని, మెదడు చురుగ్గా ఉంటుందని, జీవితకాలం కూడా పెరగవచ్చని నిరూపించింది.
షారుఖ్ ఖాన్ ఫాలో అయ్యే ఈ సింపుల్ డైట్ ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు తమ లైఫ్‌స్టైల్‌కి తగ్గట్లు ఫాలో అవ్వవచ్చు.
































